సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గుతున్న తరుణంలో సరైన పాత్ర పడితే కెరీర్ పుంజుకోవడం సాధ్యమవుతుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా, విలన్ గా (comedian, villain)సక్సెస్ అయిన జయప్రకాష్ రెడ్డి(Jayaprakash Reddy) 2020 సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన మృతి చెందారు.
కార్డియాక్ అరెస్ట్ వల్ల జయప్రకాష్ రెడ్డి మృతి చెందారు.అయితే తన సినీ కెరీర్ మలుపు తిరగడానికి ఒక విలన్ రోల్ కారణమని ఆయన జీవించి ఉన్న సమయంలో చెప్పుకొచ్చారు.
ఒకరోజు హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లగా అదే సమయంలో అక్కడికి ప్రొడ్యూసర్ రామానాయుడు వచ్చారని ఆయన తెలిపారు.నన్ను చూసి రామానాయుడు జయప్రకాష్(Ramanaidu Jayaprakash) ఇలా రా అన్నారని ఆయనను నేను అంకుల్ అని పిలిచేవాడినని జయప్రకాష్ చెప్పుకొచ్చారు.
ఆ సమయంలో రామానాయుడుతో ఈ మధ్య నాకు అంత బాగా కలిసిరావడం లేదని అవకాశాలు కూడా తగ్గిపోయాయని చెప్పానని జయప్రకాష్ పేర్కొన్నారు.

నేను చేసిన రోల్స్ కు సైతం సరిగ్గా రెమ్యునరేషన్ (Remuneration)అందడం లేదని చెప్పగా ప్రేమించుకుందాంరా సినిమా ఫోటో సెషన్ కు హాజరు కావాలని ఆయన చెప్పారని ఆ సినిమాలో మెయిన్ విలన్ గా ఎంపికయ్యానని జయప్రకాష్ వెల్లడించారు.ఆ సినిమా కోసం కర్నూలు, నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లను కలిశానని జయప్రకాష్ పేర్కొన్నారు.

ఆ సమయంలో రైటర్ పరుచూరి గోపాలకృష్ణ నుంచి కూడా పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందాయని ఆయన చెప్పుకొచ్చారు.వీరభద్రయ్య పాత్ర కోసం అంతలా కృషి చేశానని ఆయన తెలిపారు.ప్రేమించుకుందాంరా సినిమా సక్సెస్ సాధించడంతో జయప్రకాష్ రెడ్డి కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.74 సంవత్సరాల వయస్సులో ప్రముఖ నటుడు జయప్రకాష్ రెడ్డి మృతి చెందగా ఆయన మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు.