ఈ ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలైన తండేల్ సినిమా (thandel movie)బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా నిర్మాతలకు సైతం మంచి లాభాలను అందిస్తోంది.
ఈ సినిమాలోని బుజ్జితల్లి సాంగ్ (Bujjithalli Song)ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ బుజ్జితల్లి సాంగ్ యూట్యూబ్ లో ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది.
సాయిపల్లవి(Sai Pallavi) సాంగ్స్ గతంలో కూడా ఇదే రేంజ్ లో వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరిగింది.త్వరలో తండేల్ మూవీ 100 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ కూడా ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
తండేల్ సినిమా లవ్ మూవీస్ ను ఇష్టపడే ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందని చెప్పవచ్చు. సాయిపల్లవి, చైతన్య (Sai Pallavi, Chaitanya)యాక్టింగ్ ఈ సినిమా సక్సెస్ కు కారణమని చెప్పవచ్చు.

దర్శకుడు చందూ మొండేటి తండేల్(Chandu Mondeti Tandel) సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోగా కమర్షియల్ గా ఈ సినిమా అంచనాలను మించి విజయం సాధించింది.చందూ మొండేటి ఈ సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.తండేల్ సినిమా ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే.

తండేల్ సినిమా సక్సెస్ నాగచైతన్యకు ఎంతో ఊరట ఇచ్చిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.తండేల్ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కడం కూడా ఈ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించింది.గీతా ఆర్ట్స్ బ్యానర్ కు తండేల్ సినిమాతో భారీ సక్సెస్ దక్కింది.
గీతా ఆర్ట్స్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ సినిమాలను నిర్మిస్తుందేమో చూడాల్సి ఉంది.తండేల్ మూవీ సాధిస్తున్న కలెక్షన్లు నాగచైతన్యకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయి.








