వింటర్ లో స్ట్రాబెర్రీలను ఇలా తీసుకుంటే అధిక బరువుకు బై బై చెప్పవచ్చు!

ప్ర‌స్తుత వింటర్ సీజన్ లో విరివిరిగా ల్లభ్యం అయ్యే పండ్ల‌లో స్ట్రాబెర్రీలు ఒకటి.చూపుల‌కు ఆకర్షణీయంగా, రుచికి అద్భుతంగా ఉండటమే కాదు.స్ట్రాబెర్రీ పండ్ల‌లో బోలెడన్ని పోషకాలు సైతం నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్య పరంగా స్ట్రాబెర్రీ పండ్లు మనకు ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.ముఖ్యంగా వింటర్ సీజ‌న్ లో స్ట్రాబెర్రీలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే అధిక బరువు సమస్యకు బై బై చెప్పవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం స్ట్రాబెర్రీలను ఎలా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారో తెలుసుకుందాం పదండి.

 Consuming Strawberries Like This In Winter Will Help You Lose Excess Weight Deta-TeluguStop.com

ముందు మూడు ఫ్రెష్ స్ట్రాబెర్రీలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక అరటి పండును తీసుకొని పీల్ తొలగించి సన్నగా స్లైసెస్ మాదిరి కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు, అరటి పండు స్లైసెస్, నైట్ అంతా వాటర్ లో నానబెట్టి పొట్టు తొలగించిన పది బాదం పప్పులు, వన్ టేబుల్ స్పూన్ గంట పాటు వాటర్ లో నానబెట్టుకున్న చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి.

చివరిగా ఒక కప్పు లో-ఫ్యాట్ మిల్క్ ను వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ బ‌నానా స్మూతీ సిద్ధం అవుతుంది.ఈ స్మూతీని వింటర్ లో బ్రేక్ ఫాస్ట్ సమయంలో తీసుకోవాలి.ఈ స్మూతీని తీసుకుంటే అతి ఆకలి దూరం అవుతుంది.

మెట‌బాలిజం రేటు పెరుగుతుంది.దీంతో అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు.

అలాగే ఈ స్మూతీని తీసుకోవడం వల్ల నీరసం, అలసట వంటివి ద‌రి చేయకుండా ఉంటాయి.గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.మరియు చర్మం ఆరోగ్యంగా, నిగారింపుగా సైతం మారుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube