కాంగ్రెస్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.సునీల్ కనుగోలు కార్యాలయంలో పోలీసుల దాడిపై కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేసులో ముగ్గురిని అక్రమంగా అరెస్ట్ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు.అయితే తమకు అందిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఎఫ్ఐఆర్ నమోదైన 20 రోజులకు అదుపులోకి తీసుకున్నారని న్యాయవాది అనగా 41 నోటీస్ ఇచ్చి ముగ్గురిని విడిచి పెట్టామని పోలీసులు తెలిపారు.అక్రమంగా అదుపులోకి తీసుకున్నందుకు ముగ్గురికి రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇప్పించాలని లాయర్ న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.







