Noopur Chhabra: యూట్యూబ్‌లో బాగా కనిపించే ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు…

చాలా మంది వెండితెరపై కనిపించాలనే ఆత్రంతో మోడల్ గా తమ కెరీర్ ని ప్రారంభిస్తుంటారు.ఈ క్రమంలోనే కొంతమందికి అడ్వర్టైజ్మెంట్స్‌లో నటించే అవకాశం వస్తుంది.

 Do You Know About This Girl Appears On Youtube Noopur Chhabra-TeluguStop.com

వచ్చినది చిన్న అవకాశమే అయినప్పటికీ వాటిని వదులుకోకుండా వాటిలో నటించి గుర్తింపు తెచ్చుకుంటారు.ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్లు( Heroines ) కెరీర్ ప్రారంభంలో ఏదో ఒక యాడ్స్ లో కనిపించే ఉంటారు.

అయితే కొంతమంది మాత్రం యాడ్స్ లోనే నటిస్తూ అలానే ఉండిపోతారు.ఎంత పాపులర్ అయినా కూడా సినిమాల్లోకి రావాలని ఆలోచన వారికి ఉండదు.

అలానే మనం ఎప్పుడు యూట్యూబ్( Youtube )

ఓపెన్ చేసినా కూడా ఒక అమ్మాయి స్మైల్ ఇస్తూ కనిపిస్తుంది.ప్రకటనలో తప్ప అమ్మాయి మరి ఎక్కడా కనిపించదు.

ఆ అమ్మాయికి సంబంధించిన వీడియో ఏమైనా ఉందా అని మనం దానిపై క్లిక్ చేస్తాం.కానీ అది ఒక ప్రకటన మాత్రమే.

ఆ వీడియోలో కనిపించే అమ్మాయి వెనక పెద్ద స్టోరీనే ఉంది.అసలు ఆ అమ్మాయి ఎవరు? కేవలం ప్రకటనలకే( Ads ) ఎందుకు పరిమితమైంది? ఆ అమ్మాయి వెనుక ఉన్న స్టోరీ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Telugu Mystery Ad, Noopur Chhabra, Noopurchhabra, Sahil, San Francisco, Youtube-

యూట్యూబ్‌లో కనిపించే అమ్మాయి పేరు నుపుర్ చాబ్రా.( Noopur Chhabra ) ఆమె భారతదేశానికి చెందిన అమ్మాయి.కానీ ప్రస్తుతం అమెరికాలో నివసిస్తుంది.ఆమె ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్, కేరింగ్ హ్యాండ్స్ ఫర్ చిల్డ్రన్( Caring Hands For Children ) అనే స్వచ్ఛంద సంస్థకు డైరెక్టర్.

నుపుర్ చాబ్రా భారతదేశంలో జన్మించినప్పటికీ చిన్న వయస్సులోనే అమెరికాకు వెళ్లిపోయింది.ఆమె శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో మార్కెటింగ్లో బ్యాచలర్ డిగ్రీ పట్టాని అందుకుంది.ఆ తరువాత ఆమె కొన్ని సంవత్సరాలు ఫేస్‌బుక్‌లో( Facebook ) పనిచేసింది.అక్కడ ఆమె టెక్నికల్ రిక్రూటర్, మార్కెటింగ్ మీడియా మేనేజర్‌గా పనిచేసింది.

Telugu Mystery Ad, Noopur Chhabra, Noopurchhabra, Sahil, San Francisco, Youtube-

నుపుర్ పేదరికంలో ఉన్న పిల్లలకు ఈ సంస్థ సహాయం చేస్తుంది.ఈ సంస్థ కు నుపుర్ చాబ్రా నే డైరెక్టర్‌గా పనిచేస్తుంది.ఇక 2020లో ఆమె ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన సాహిల్‌ని వివాహం చేసుకుంది.ప్రస్తుతం వారిద్దరూ శాన్ ఫ్రాన్సిస్కోలో జీవనం కొనసాగిస్తున్నారు.ఆమె స్వచ్ఛందంగా పనిచేయడానికి, ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.ఆమె యువతకు ఒక ప్రేరణగా ఉన్నారు.

అయితే కొన్నేళ్ల వరకూ కనిపించిన ఆమె పిక్ ఇప్పుడు యూట్యూబ్ లో కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube