వేసవి కాలం వస్తూ వస్తూనే తనతో పాటు ఎన్నో సమస్యలను మోసుకొస్తుంది.ముఖ్యంగా అధిక దాహం, డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్, చెమటలు, ఉక్కపోత వంటివి వేసవిలో ప్రధానంగా వేధించే సమస్యలు.
వీటిని తట్టుకొని బాడీని రిఫ్రెష్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ డ్రింక్‌ను డైట్‌లో చేర్చుకుంటే చాలా అంటే చాలా సులభంగా వేసవిలో బాడీని రిఫ్రెష్ చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సూపర్ డ్రింక్ ఏంటో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక కప్పు సీడ్‌లెస్ బ్లాక్ గ్రేప్స్‌ను తీసుకుని ఉప్పు నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో కడిగి పెట్టుకున్న బ్లాక్ గ్రేప్స్ వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఉడికించిన బ్లాక్ గ్రేప్స్‌ను మెత్తగా స్మాష్ చేసుకుని జ్యూస్‌ను మాత్రం సపరేట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మళ్లీ స్టవ్ ఆన్ చేసుకుని.మరో గిన్నె పెట్టి అందులో గ్రేప్ జ్యూస్, నాలుగు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగర్ వేసి మూడు నిమిషాల పాటు మరిగించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసి.
అందులో రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్‌ను యాడ్ చేసి మిక్స్ చేసుకుని బాగా చల్లారబెట్టుకంటే గ్రేప్ జ్యూస్ సిరప్ సిద్ధం అవుతుంది.దీనిని బాటిల్‌లో ఫిల్ చేసుకుని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు.
ఇక రిఫ్రెష్ డ్రింక్ ఎలా చేసుకోవాలి.ఒక గ్లాస్ తీసుకుని అందులో ఐదు ఐస్ క్యూబ్స్, కప్పు గ్రేప్ జ్యూస్ సిరప్, హాఫ్ గ్లాస్ వాటర్, కిన్ని చాప్డ్ గ్రేప్స్ వేసి కలుపుకుంటే సరిపోతుంది.
ఈ డ్రింక్‌ను రోజుకు ఒకసారి తీసుకుంటే మీ శరీరం క్షణాల్లో రిఫ్రెష్ అవుతుంది.ఒత్తిడి, అలసట, తలనొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి.
డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.మరియు తరచూ దాహం వేయకుండా కూడా ఉంటుంది.
కాబట్టి, తప్పకుండా ఈ డ్రింక్‌ను ట్రై చేయండి.