భగవంతుని( God’s ) ముందు మనం ఏడవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.అసలు దేవుడి ముందు మనం ఎందుకు ఏడవాల్సి వస్తుంది.
ఎలాంటి సందర్భాల్లో మనకు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు ఏడుపొస్తుంది.ఇంకా చెప్పాలంటే భగవంతుడి ముందు కూర్చొని మన దుఃఖాన్ని తీర్చుకుంటే మన పాపాన్ని తొలగిపోతాయా.
ఈ విషయాలన్నీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.పండితులు చెప్పిన దాని ప్రకారం చేసిన పాపన్ని భగవంతుని దగ్గర చెప్పుకొని నా పాపాన్ని క్షమించు అని చెప్పి నాలుగు గోడల మధ్య కూర్చొని భగవంతుడికి చెప్పుకుంటే ఆ పాపం పోతుందా.

ఇలా చేస్తే పాపాలు ఏమి తొలగిపోవు.మీరు చేసిన పాపాలు తొలగిపోవాలి అంటే ఎవరి పట్ల అయితే మనం పాపం చేసామో వారి దగ్గరకు వెళ్లి నీ విషయంలో నేను తప్పు చేశాను.నీ గురించి ఇతరులకు చెడుగా చెప్పాను.నీతో పాటు నేను వ్యాపారం చేస్తూ నీకు నష్టాన్ని కలిగించాను.మీ కుటుంబంలో నేను గొడవలు పెట్టాను.అని మీరు చేసిన తప్పుల గురించి వారి దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాలి.
మీ పట్ల నేను చేసిన తప్పు కాబట్టి ఆ తప్పిదానికి నన్ను క్షమించు అని చెప్పాలి.

అలా అని మీరు చేసిన తప్పుకి ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత వెళ్లి నేను చేసినది తప్పు అని చెబితే కూడా ఎటువంటి ఫలితం ఉండదని పండితులు ( Scholars )చెబుతున్నారు.ఎందుకంటే మీరు చేసిన తప్పుకి ఫలితాన్ని అనుభవించిన తర్వాత చెబితే ఎటువంటి ప్రయోజనం ఉండదని కూడా చెబుతున్నారు.కాబట్టి పాపాన్ని చేసినప్పుడు మీరు భగవంతుడి దగ్గర కూర్చొని దుఃఖిస్తూ నా పాపాలను తొలగించు అని ప్రార్థించాలి.
అది కూడా మీ వల్ల బాధను అనుభవించిన వారికి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే ఇలా చేయాలి.అలాగే చేసిన పాపాన్ని భగవంతుని ముందు చెప్పుకుంటే మనసులోని భారం కూడా కాస్త తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.
ఇలా పాపాలను చేసి భగవంతున్ని క్షమించమని ప్రార్థించిన తర్వాత మళ్లీ ఎలాంటి పాపాలను కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు.