సాధారణంగా కొందరు పిల్లల్లో చురుకుదనమే ఉండదు.ఇలాంటి వారు ఏ విషయం మీదా దృష్టిని కేంద్రీకరించ లేరు.
ఒంటరిగానే ఉంటుంటారు.ఎప్పుడూ డల్ మూడ్‌లో ఉంటారు.
సరిగ్గా తినరు.ఇక పిల్లలు చురుగ్గా, చలాకీగా లేకుండా ఉంటె తల్లిదండ్రులు తెగ హైరానా పడి పోతుంటారు.
ఏం చేయాలో తెలియక తెగ సతమతమైపోతుంటారు.అలాంటప్పుడు తల్లిదండ్రులు పిల్లల డైట్‌లో ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను చేర్చాల్సి ఉంటుంది.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.,/br>
పాలు మరియు పాల ఉత్పత్తుల్లో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి.
అందువల్ల పిల్లల డైలీ డైట్‌లో పాలు, పెరుగు, నెయ్యి వంటివి ఖచ్చితంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవాలి.అప్పుడే పిల్లలకు పోషకాలు అంది చురుగ్గా మారతారు.
పాలతో పాటు ఉడికించిన గుడ్డును కూడా రెగ్యులర్‌గా పిల్లలకు ఇవ్వాలి.
పిల్లలు చురుగ్గా ఉండాలంటే.వారికి ఓట్స్‌ను కూడా తప్పకుండా పెట్టాలి.ఓట్స్‌లో ప్రోటీన్, ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, జింక్, సెలీనియం, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ బి, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి.
ఇవి పిల్లల మెదడు చురుగ్గా పని చేయడానికి ఉపకరిస్తాయి.మరియు ఓట్స్ తీసుకుంటే పిల్లలకు తక్షణ శక్తి కూడా లభిస్తుంది.
ఎప్పుడూ పిల్లలకు బెండికాయ, దొండకాయ, బీరకాయ, బంగాళదుంప, వంకాయ వంటి కూరగాయలే కాకుండా చిలగడ దుంపలు, గుమ్మడికాయ, క్యారెట్లు, బీట్‌రూట్, క్యాప్సికమ్, క్యాబేజ్, పాలకూర, బచ్చలికూర, గోంగూర, బ్రొక్కొలి, చిక్కుళ్ళు వంటివి కూడా పెట్టాలి.అప్పుడే అన్ని పోషకాలు అంది పిల్లలు చురుగ్గా మారతారు.
మరియు పిల్లల డైట్‌లో తాజా పండ్లు, నట్స్ ఉండేలా చూసుకోవాలి.
అలాగే నిద్ర తక్కువైనా పిల్లల్లో చురుకుదనం తగ్గుతుంది.
కాబట్టి, పిల్లలు ఖచ్చితంగా 9 నుంచి 10 గంటల పాటు నిద్రించేలా చూసుకోవాలి.ఇక ప్రతి రోజు పిల్లల చేత చిన్న చిన్న వ్యాయామాలు, యోగా వంటివి చేయిస్తే.
వారు ఫిట్‌గా మరియు చురుగ్గా మారతారు.జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతుంది.