టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్లుగా తిరుగులేని ప్రస్థానాన్ని హీరోయిన్ల గురించి ప్రస్తావన వస్తే ముందుగా వినిపించే పేర్లు విజయశాంతి, రాధ అన్న విషయం తెలిసిందే.ఎందుకంటే దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇద్దరు హీరోలు కూడా స్టార్ హీరోలకు మించి క్రేజ్ సంపాదించుకున్నారు అని చెప్పాలి.
బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి తమకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు.ఒకవైపు నటనపరంగా విజయశాంతి.
అందం అభినయం డాన్సుల పరంగా రాధా హీరోలతో పోటీ పడేవారు.
అయితే ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా అటు మెగాస్టార్ కు బెస్ట్ జోడి అని పేరు సంపాదించుకున్నారు అనే విషయం తెలిసిందే.
ఇక వీరి కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి అంటే చాలు పక్కా హిట్ అని నిర్మాతలు కూడా నమ్మేవారు.అందుకే ఇక వీరి కాంబినేషన్ ఎన్నోసార్లు రిపీట్ అయింది అని చెప్పాలి.
అయితే ఇలా స్టార్ హీరోయిన్లు గా కొనసాగిన విజయశాంతి, రాధ మధ్య అప్పట్లో కోల్డ్ వారు జరిగేదట.ముఖ్యంగా చిరంజీవి సినిమాల విషయంలో విజయశాంతి రాధ మధ్య అసలు మాటలు కూడా ఉండేవి కాదట.

అయితే హీరోయిన్లు కూడా ఎవరికి వారు చిరంజీవితో సినిమాల్లో నటించి సూపర్ హిట్లు కొట్టారు.రాధ ఆతర్వాత కాలంలో ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా మారిపోయి చిత్ర పరిశ్రమకు దూరం అయింది.కానీ విజయశాంతి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది.ఈ క్రమంలోనే రాధా కంటే ఎక్కువ సంవత్సరాలు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో కొనసాగింది.
రాధా మాత్రం మంచి అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ కోసం సినీ కెరీర్ త్యాగం చేసేసింది అని చెప్పాలి.