బెల్లం.( Jaggery ) రుచి పరంగానే కాదు పోషకాల పరంగా కూడా భేష్ అనే చెప్పాలి.
బెల్లంలో పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం, సెలీనియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో సహా వివిధ రకాల సమ్మేళనాలు పుష్కలంగా నిండి ఉంటాయి.అందుకే ప్రస్తుత రోజుల్లో చాలా మంది పంచదారకు ప్రత్యామ్నాయంగా బెల్లాన్ని ఎంచుకుంటున్నారు.
పరిమితంగా తీసుకుంటే బెల్లం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.పైగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా బెల్లానికి ఇప్పుడు చెప్పబోయే పదార్థాలను కలిపి తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.
బెల్లం-నువ్వులు.
ఈ రెండింటి కాంబినేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.బెల్లం, నువ్వులు( Sesame Seeds ) కలిపి పొడి చేసి లడ్డూల మాదిరి చుట్టుకుని రోజుకు ఒకటి చొప్పున తింటే రక్తహీనత దూరం అవుతుంది.
ఆడవారిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి.ఎముకలు బలోపేతం అవుతాయి.
మోకాళ్ళ నొప్పులు పరార్ అవుతాయి.
![Telugu Black Pepper, Tips, Jaggery, Sesame Seeds, Turmeric, Turmeric Powder-Telu Telugu Black Pepper, Tips, Jaggery, Sesame Seeds, Turmeric, Turmeric Powder-Telu](https://telugustop.com/wp-content/uploads/2024/07/Taking-these-together-in-jaggery-has-many-health-benefits-detailss.jpg)
అలాగే బెల్లానికి మిరియాలు కలిపి తీసుకోవడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి.రోజు ఉదయం ఒక గ్లాస్ గోరు వెచ్చని వాటర్ తీసుకుని అందులో అర టీ స్పూన్ బెల్లం పొడి, చిటికెడు మిరియాల పొడి( Black Pepper ) కలిపి తాగితే శరీరంలో వ్యర్థాలు బయటకు తొలగిపోతాయి.రక్త శుద్ధి జరుగుతుంది.
జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.మలబద్ధకం సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.
పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సైతం కరుగుతుంది.
![Telugu Black Pepper, Tips, Jaggery, Sesame Seeds, Turmeric, Turmeric Powder-Telu Telugu Black Pepper, Tips, Jaggery, Sesame Seeds, Turmeric, Turmeric Powder-Telu](https://telugustop.com/wp-content/uploads/2024/07/Taking-these-together-in-jaggery-has-many-health-benefits-detailsa.jpg)
ఇక బెల్లం, పసుపు కాంబినేషన్ కూడా ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది.అర టీ స్పూన్ బెల్లం పొడిలో చిటికెడు ఆర్గానిక్ పసుపు( Organic Turmeric ) కలిపి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.
బెల్లం మరియు పసుపులోని పొటాషియం కంటెంట్ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.