కొత్త పార్టీ పెట్టేస్తున్న ప్రశాంత్ కిషోర్ .. పేరేంటంటే ?

దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందిస్తూ సక్సెస్ ఫుల్ రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్( Prasanth Kishore ) చాలాకాలంగా రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందించే బాధ్యతల నుంచి తప్పుకున్నారు అయితే తనకు చెందిన ఐ ప్యాక్ టీం( IPAC ) ద్వారా ఆ వ్యూహాలను అందిస్తున్నారు.అయితే బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అక్కడ పాదయాత్ర సైతం చేపట్టి రాజకీయ పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేశారు.

 Prashanth Kishore Announces New Political Party Jan Suraaj Details, Jdu, Prasant-TeluguStop.com

తాజాగా ఓ కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.పాట్నాలో నిర్వహించిన జన సూరజ్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీహార్ కేంద్రంగా ‘ జన సూరాజ్ ‘( Jan Suraaj Party ) పేరుతో ఓ ప్రజా చైతన్య సంస్థను నడుపుతున్నానని,

Telugu Bihar Cm, Cm Nitish Kumar, Ipac, Jan Suraaj, Ys Jagan, Ysrcp-Politics

అదే పేరును తాను కొత్తగా పెట్టబోయే పార్టీకి పెడుతున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు .అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా జన సురాజ్ ‘ పార్టీని ప్రకటిస్తామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.2025 లో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన సురాజ్ బర్రిలోకి దిగుతుందని , ఒంటరిగానే జేడీయూ అధినేత, సీఎం నితీష్ కుమార్ ను( CM Nitish Kumar ) ఎదుర్కొంటామని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు.అయితే కొత్త పార్టీకి ఎవరు నేతృత్వం వహిస్తారు అనేది త్వరలోనే వెల్లడిస్తానని ఆయన తెలిపారు.

మెరుగైన విద్య, వైద్యం, బీహార్ భవిష్యత్తు కోసం శ్రమించాలని కార్యకర్తలకు ప్రశాంత్ కిషోర్ సూచించారు.

Telugu Bihar Cm, Cm Nitish Kumar, Ipac, Jan Suraaj, Ys Jagan, Ysrcp-Politics

రెండేళ్ల క్రితం బీహార్ లో జన స్వరాజ్ యాత్రను ప్రశాంత్ కిషోర్ ప్రారంభించారు.అయితే ప్రస్తుతం జన సూరాజ్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేసి బిజెపి జెడియు కూటమి ప్రభుత్వాన్ని ఢీకొడతారా లేక ఆర్జెడితో పొత్తు పెట్టుకుంటారా అనేది తేలాల్సి ఉంది.ఇదిలా ఉంటే గతంలో ప్రశాంత్ కిషోర్ అనేక రాజకీయ పార్టీలకు వ్యూహ కర్తగా పనిచేశారు.

ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి జెడియు పార్టీలో చేరారు.ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కూడా చేపట్టారు.

ఆ తర్వాత కొంతకాలానికి ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.అప్పటి నుంచి జేడీయూ అదినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ పై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తూ వస్తున్నారు.

ఇప్పుడు కొత్త పార్టీ స్థాపించడం వెనుక జేడీయూను ఓడించడమే ప్రశాంత్ కిషోర్ లక్ష్యంగా కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube