బోయపాటి ముందుగా విలన్లనే సెలెక్ట్ చేసుకుంటారా.. ఈ సినిమాల్లో విలన్లు కేక పుట్టించారుగా..?

బోయపాటి శ్రీను( Boyapati Srinu ) సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.ఈ దర్శకుడు తన సినిమాలకు కథలన్నీ తానే రాసుకుంటాడు.

 Boyapati Srinu Selection Of Villains Roles Details, Boyapati Srinu , Boyapati Sr-TeluguStop.com

బోయపాటి శ్రీను తన సినిమాలో విలన్ క్యారెక్టర్ లను చాలా చక్కగా డిజైన్ చేసుకుంటాడు.కథ రాసుకున్న తర్వాత ముందుగా విలన్ క్యారెక్టర్లు దొరికిన తర్వాతనే హీరోలను వెతకడం ప్రారంభిస్తాడు.

కొన్ని సినిమాలు చూస్తే ఆయన విలన్ క్యారెక్టర్లే ముందుగా రాసుకున్నాడని అర్థమవుతుంది.ఆ సినిమాలేవో తెలుసుకుందాం.

• సరైనోడు

Telugu Adi Pinishetty, Akhanda, Boyapati Srinu, Boyapatisrinu, Sarrainodu, Srika

2016లో విడుదలైన విజిలెంట్ యాక్షన్ మూవీ “సరైనోడు”లో( Sarrainodu ) హీరో అల్లు అర్జున్‌ కంటే విలన్ ఆది పినిశెట్టి( Aadi Pinisetty ) బాగా హైలైట్ అయ్యాడు.ఎందుకంటే బోయపాటి శ్రీను ఆ విలన్ క్యారెక్టర్‌ని చాలా గొప్పగా రాసుకున్నాడు.వైరం ధనుష్‌గా ఆది పినిశెట్టి చేసిన యాక్షన్ సీక్వెన్స్ లో వెన్నులో వణుకు పుట్టించాయి.

దీన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ప్రొడ్యూస్‌ చేశారు.

దీనిలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ త్రెసా, శ్రీకాంత్ కూడా యాక్ట్ చేసి మెప్పించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెట్టిన బడ్జెట్ కంటే రెట్టింపు మనీ కలెక్ట్ చేసింది.</br

• వినయ విధేయ రామ

Telugu Adi Pinishetty, Akhanda, Boyapati Srinu, Boyapatisrinu, Sarrainodu, Srika

రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ యాక్షన్ సినిమాలో రాజా భాయ్ మున్నాగా వివేక్ ఒబెరాయ్( Vivek Oberoi ) నటించి మెప్పించాడు.ఈ సినిమా చాలా చెత్తగా ఉంటుంది కానీ ఇందులో వివేక్ యాక్షన్స్ సన్నివేశాలు మాత్రం ఈలలు వేయిస్తాయి.ఈ క్యారెక్టర్ తెలుగు విలన్ క్యారెక్టర్లలో టాప్ గా నిలిచిపోయింది.

• అఖండ

Telugu Adi Pinishetty, Akhanda, Boyapati Srinu, Boyapatisrinu, Sarrainodu, Srika

యాక్షన్ డ్రామా ఫిలిం అఖండ( Akhanda ) రూ.60 కోట్లతో తెరకెక్కి రూ.150 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఇందులో శ్రీకాంత్( Srikanth ) రోల్‌ చాలా బాగా హైలైట్ అయింది.కాపర్ మైనింగ్ ఓనర్ వరదరాజులుగా శ్రీకాంత్ నటించి బాగా అలరించాడు.యాక్టింగ్ లో బాలయ్యకే ఈ హీరో పోటీ వచ్చాడు.ఒక వైల్డ్ ఫైర్ విలన్‌గా శ్రీకాంత్ ఇందులో తన నటనలోని కొత్తకోణాన్ని చూపించాడు.

ఎప్పుడు ఫ్యామిలీ హీరోగా కనిపించే శ్రీకాంత్ ను ఇలాంటి మాస్ క్యారెక్టర్ లో చూపించాలనే ఆలోచన మొదటగా బోయపాటి శ్రీనుకి రావడం విశేషం.ఏదేమైనా బోయపాటి శ్రీను విలన్ కూడా చాలా స్టైలిష్ గా చూపిస్తూ తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube