యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) నటించిన దేవర సినిమా( Devara ) రిలీజ్ కావడానికి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది.ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్ కానుంది.
ఈ సాంగ్ మాస్ సాంగ్ అని ఎన్టీఆర్, జాన్వీ మధ్య డ్యాన్స్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం అందుతోంది.అయితే తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మంచి మనస్సును చాటుకుని వార్తల్లో నిలిచారు.
వరదల వల్ల( Floods ) ఏపీ, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తన దృష్టికి రావడంతో తారక్ ఏకంగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడం గమనార్హం.కోటి రూపాయలు విరాళంగా ప్రకటించడం సాధారణ విషయం కాదు.అటు ఏపీకి( AP ) ఇటు తెలంగాణకు( Telangana ) చెరో 50 లక్షలు విరాళంగా ప్రకటించి తారక్ మంచి మనస్సును చాటుకున్నారు.తారక్ విరాళం ప్రకటించడంతో మరి కొందరు హీరోలు ఈ దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు చాలా తక్కువమంది ఉంటారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యాక్తమవుతున్నాయి.జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించిన కొంత సమయానికే విశ్వక్ సేన్( Vishwak Sen ) సైతం రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.ప్రజలు కష్టాల్లో ఉన్న సమయంలో సహాయం చేసే మంచి మనస్సు కొంతమందికే ఉంటుందని చెప్పవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ చేసిన సహాయం గురించి నెటిజన్లు స్పందిస్తూ “సూపర్ తారక్” అని కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు జూనియర్ ఎన్టీఆర్ మనస్సున్న మారాజు అని చెబుతున్నారు.దేవర సినిమా విషయంలో సైతం ఇండస్ట్రీలో పాజిటివ్ వైబ్స్ ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తారక్ ఖాతాలో మరిన్ని సంచలన రికార్డులు చేరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.