వేసవి కాలం ప్రారంభం అవుతోంది.ఎండలు మెల్ల మెల్లగా ఊపందుకుంటున్నాయి.
ఈ సీజన్‌లో నీరసం, అలసట, దాహం, తలనొప్పి, డీహైడ్రేషన్ వంటి వాటితో పాటు మలబద్ధకం సైతం అధికంగానే వేధిస్తుంటుంది.దీని కారణంగా ఎప్పుడూ అసౌకర్యంగా ఫీల్ అవ్వడం, ఆకలి తగ్గిపోవడం, పనిపై ఏకాగ్రత లోపించడం, కడుపు నొప్పి వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి.
అందుకే మలబద్ధకాన్ని వదిలించుకోవడం కోసం నానా ప్రయత్నాలు చేస్తుంటాయి.అయితే వేసవిలో ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను పాటిస్తే గనుక మలబద్ధకాన్ని సులభంగా నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు లేటు ఆ టిప్స్ ఏంటో కిందకు ఓ లుక్కేసేయండి.
పుచ్చకాయ.
.సమ్మర్ సీజన్‌లో తప్పని సరిగా తీసుకోవాల్సిన ఫ్రూట్ ఇది.ఎన్నో పోషక విలువలను కలిగి ఉండే పుచ్చకాయ మలబద్ధకం సమస్యను దూరం చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది.తరచూ పుచ్చకాయ రసం తీసుకుంటే గనుక.
మలబద్ధకం పరార్ అవ్వడమే కాదు డీహైడ్రేసన్, అధిక దాహం, నీరసం వంటి సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

మలబద్ధకాన్ని నివారించడంలో కీర జ్యూస్ గ్రేట్‌గా సహాయపడుతుంది.ఈ జ్యూస్‌ను వారంలో నాలుగు సార్లు తీసుకుంటే గనుక జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారి మలబద్ధకం సమస్య తగ్గు ముఖం పడుతుంది.మరియు గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అలాగే టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటివి తాగడం తగ్గించాలి.మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.తద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటమే కాదు మలబద్ధం సమస్య సైతం తగ్గుతుంది.
ఇక మలబద్ధకంతో తీవ్రంగా బాధ పడేవారు ఒక కప్పు పెరుగులో రెండు టేబుల్ స్పూన్ల అల్లం రసాన్ని కలిపి తీసుకోవాలి.
ఇలా చేసినా ఆ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.పైగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.





 

