అధిక హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న పురుషులకు బెస్ట్ సొల్యూషన్ ఇది!

పురుషుల్లో కొందరు అధిక హెయిర్ సమస్యతో చాలా సతమతం అయిపోతూ ఉంటారు.జుట్టు రాలడాన్ని( Hair Fall ) ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా విఫలం అవుతూ ఉంటారు.

 This Is The Best Solution For Men Suffering From Excessive Hair Fall Details, H-TeluguStop.com

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి.ప్రధానంగా ఒత్తిడి, పోషకాల కొరత, కాలుష్యం, రేడియేషన్ వంటి అంశాలు హెయిర్ రూట్స్ ను వీక్ గా మారుస్తాయి.

దాంతో జుట్టు రాలడం అధికంగా మారుతుంది.అయితే హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న పురుషులకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Coconut Oil, Fenugreek Seeds, Care, Care Tips, Fall, Healthy, Hibiscus, L

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు( Fenugreek Seeds ) వేసుకోవాలి.అలాగే రెండు లేదా మూడు మందారం ఆకులు,( Hibiscus Leaves ) వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ ఆముదం మరియు ఒక కప్పు బియ్యం నానబెట్టిన వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట అనంతరం గాఢత తక్కువున్న షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Coconut Oil, Fenugreek Seeds, Care, Care Tips, Fall, Healthy, Hibiscus, L

వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా లాభాలు పొందుతారు.మెంతులు, మందార ఆకులు, కొబ్బరి నూనె, ఆముదం మరియు బియ్యం నీరు లో ఉండే పోషకాలు జుట్టును ఆరోగ్యంగా దృఢంగా మారుస్తాయి.జుట్టు రాలడాన్ని సమర్థవంతంగా అరికడతాయి.

అదే సమయంలో హెయిర్ గ్రోత్ ను( Hair Growth ) పెంచుతాయి.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

కాబట్టి హెయిర్ ఫాల్తూ బాధపడుతున్న పురుషులు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.అలాగే ఒత్తిడికి వీలైనంత దూరంగా ఉండండి.మొబైల్ వాడకం తగ్గించండి.డైట్ లో పోషకాహారాన్ని చేర్చుకోండి.

ముఖ్యంగా నట్స్, సీడ్స్, గుడ్లు, పాలకూర, అరటి పండ్లు, జామ, సిట్రస్ పండ్లు తదితర ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.ఇవి జుట్టు రాలడాన్ని అరికడతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube