రుపాయి ఖర్చుపెట్టకుండా అమ్మాయిని సంతోషపెట్టవచ్చా?

ప్రేయసిని ఎలా సంతోషపెట్టాలి? ఈ ప్రశ్న మెదడులో మెదలగానే, మంచి గిఫ్ట్ ఇవ్వాలనో, సినిమాకి, షికారుకు తీసుకెళ్ళాలనో, తనకేదో కొనివ్వాలనో అనిపిస్తుంది.అంటే, డబ్బు ఖర్చుపెట్టకుండా అమ్మాయిని సంతోషపెట్టవచ్చు అనే ఆలోచనే రాదు అబ్బాయిలకి.

 How To Spend Time With Her Without Spending Money?-TeluguStop.com

వారే అలవాటు చేసి, గర్ల్ ఫ్రెండ్ ని మెయింటేన్ చేయడం కష్టం అని స్టేట్‌మెంట్స్ ఇస్తుంటారు.కాని రూపాయి ఖర్చుపెట్టకుండా కూడా అమ్మాయి ముఖంపై చిరునవ్వు తెప్పియ్యవచ్చు.

తనకి బోర్ కొట్టకుండా చేయవచ్చు.

* బాయ్ ఫ్రెండ్ రొమాంటిక్ గా ఉంటే ఏ అమ్మాయి ఇష్టపడదు చెప్పండి.

రొమాంటిక్ గా ఉండటం అంటే, మరీ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు.అలా చేస్తే రివర్స్‌ గా, అమ్మాయికి కోపం కూడా రావచ్చు.

నుదిటిపై ముద్దుపెట్టండి, మీరెంత కేరింగ్ అనేది తనకి సెకనుకో అర్థం అయిపోతుంది.తలని నిమురుతూ, తననే చూసుకుంటూ కూర్చోండి.

ఏ కాఫీ షాప్ లోనో, సినిమా హాల్ లోనో దొరకని సంతోషం మీ చూపులో తనకి కనబడుతుంది.

* తనకిష్టమైన విషయాల గురించి మాట్లాడండి.

మీ మాటలో మాట కలుపుతూ, గంటలు మాట్లాడేస్తుంది.బయటకి వెళదాం అనే టాపిక్ కూడా రాదు.

* రెస్టారెంట్ లో వేలకి వేలు ఖర్చుపెట్టే బదులు, మీ చేతి వంట తినిపించండి.ఇద్దరం కలిసి వంట చేద్దాం అని పిలవండి.

ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటూ, వంటగదిలో పనిచేసి తింటే వచ్చే ఆనందం, రెస్టారెంట్‌ లో ఎక్కడ దొరుకుతుంది?

* అలాగని చెప్పి, తను ఒకటి కోరిన తరువాత దాన్ని కాదని, మీ ఐడియా మాత్రం చెప్పవద్దు.రెస్పాన్స్ మీరు అనుకున్నట్లుగా రాదు.

తాను కోరక ముందే, తనకి టైమ్ పాస్ అయ్యే ఐడియాతో మీరే వెళ్ళడం కరెక్ట్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube