సాధారణంగా కొందరి జుట్టు చాలా అంటే చాలా పల్చగా తయారవుతుంటుంది.ఇందుకు అధిక హెయిర్ ఫాల్( Hairfall ) ఒక కారణం అయితే హెయిర్ గ్రోత్ లేకపోవడం మరొక కారణం.
పల్చటి కురులను మళ్లీ దట్టంగా మార్చుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ హెయిర్ టానిక్ ను అస్సలు మిస్ అవ్వకండి.ఈ టానిక్ ను వాడడం అలవాటు చేసుకుంటే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్న రెండు నెలల్లో ఒత్తుగా మారడం గ్యారెంటీ.

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు బియ్యం( Rice ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు,( Green Tea Leaves ) వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు వేసి ఒక గ్లాసు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి బియ్యం, గ్రీన్ టీ మరియు రోజ్ మేరీ ఆకులు నానబెట్టుకున్న గిన్నెను పెట్టి దాదాపు పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసి చల్లారబెట్టుకోవాలి.

గోరువెచ్చగా అయ్యాక ఈ వాటర్ లో వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ మిక్స్ చేశారంటే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండుసార్లు అప్లై చేసుకుని మంచిగా మసాజ్ చేసుకోవాలి.టానిక్ అప్లై చేసుకున్న గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ టానిక్ ను ఉపయోగించారంటే జుట్టు ఎదుగుదలకు అవసరమయ్యే పోషణ అందుతుంది.
జుట్టు కుదుళ్ళు దృఢంగా మారతాయి.హెయిర్ ఫాల్ తగ్గు ముఖం పడుతుంది.
హెయిర్ రీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది.పల్చటి కురులు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా మారుతాయి.
పైగా ఈ టానిక్ ను ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్య కూడా దూరం అవుతుంది.