ఒకప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నై లో ఉండేది.అప్పుడు తెలుగు వాళ్లంతా ట్రైన్ ఎక్కి చెన్నై వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసి చివరకు సినిమా అవకాశాలు దక్కించుకొని అలా సినిమాల్లో కనిపించినవారే ఇప్పుడు ఉన్న చాలామంది సీనియర్ ఆర్టిస్టులు.
మన శివ శంకర వరప్రసాద్ కూడా ఆలా సినిమా అవకాశాల కోసం చెన్నై ట్రైన్ ఎక్కి వెళ్లినవాడే అక్కడ ఒకే రూమ్ లో ప్రసాద్ బాబు, సుధాకర్, నారాయణ రావు, శివ శంకర వరప్రసాద్ అయితే మొదట్లో ప్రసాద్ బాబుకి హీరోగా మంచి అవకాశాలు వచ్చాయి.అయన హీరోగా చేస్తున్న సినిమాల్లో వీళ్ళందరూ చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసేవాళ్లు ఆయనకి ఉత్తమ హీరోగా చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి.
కానీ సినిమా ఇండస్ట్రీ లో రోజులన్నీ ఒకేలా ఉండవు కదా ఈ రోజు హీరోగా ఉన్న వాళ్ళే రేపు సైడ్ క్యారెక్టర్స్ చేయచ్చు, ఇప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నవాళ్ళే రేపు పొద్దున పెద్ద హీరో అవ్వచ్చు.అలాగే అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసే శివ శంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి కూడా ఆలా సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే సినిమా సినిమాకి తన నటనని ఇంప్రూవ్ చేసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు.
తనకి ఎంత చిన్న క్యారెక్టర్ వచ్చిన తనకి తన మార్క్ నటన ని చూపిస్తూ రోజురోజుకి తన నటనలో వచ్చే మార్పుకి ఆశ్చర్యపడేవాడు అంటే అయన కష్టం ఎంతలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు.
ఆలా చిరంజీవి క్రమ క్రమంగా సినిమాలు చేసుకుంటూ చిన్న చిన్న హీరో వేషాలు వేస్తూ సినిమాలు చేస్తు వచ్చాడు ఎప్పుడైతే ఖైదీ సినిమా వచ్చిందో చిరంజీవి మెగాస్టార్ అయిపోయాడు.చిరంజీవి వరసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ వచ్చాడు చిరంజీవి హీరో అయినా తర్వాత వాళ్ళ రూమ్మేట్స్ అయిన సుధాకర్, నారాయణ రావు, ప్రసాద్ బాబులకు డైరెక్టర్స్ తో చెప్పి మంచి క్యారెక్టర్స్ ఇప్పించాడు.నారాయణ రావు హిట్లర్ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసాడు.
ప్రసాద్ బాబుకి రుద్రవీణ, యముడికి మొగుడులాంటి సినిమాలో మంచి వేషం ఇప్పించాడు.సుధాకర్ మొదట్లో విలన్ గా చేసి తర్వాత కమెడియన్ గా అయ్యాడు.
చాలాకాలం పాటు మంచి కామెడియన్ గా వెలుగొందాడు.అయితే మధ్యలో సుధాకర్ కి యాక్సిడెంట్ అయి కొన్ని రోజులు కోమాలో ఉంటె చిరంజీవి తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేయించాడు అని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.ప్రస్తుతం చిరంజీవి రాజకీయాల నుంచి బయటికి వచ్చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఖైదీ No.150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి ఆచార్య మూవీతో తొందర్లో మన ముందుకు రాబోతున్నాడు.
ఇది ఇలా ఉంటె ప్రసాద్ బాబు అడపాదడపా సినిమాలు చేస్తూ సీరియల్స్ లో బిజిగా ఉన్నారు.ప్రసాద్ బాబు కొడుకు కూడా సీరియల్స్ లో ఆక్ట్ చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు.అయన కొడుకు ఎవరో కాదు చాలా సీరియల్స్ లో మనం చూస్తూనే ఉంటాం శ్రీకర్ ని.అయితే ప్రసాద్ బాబు కోడలు కూడా మనకు తెలిసిన అమ్మాయే.ఆమె ఎవరంటే సంతోషిణి.
డైరెక్టర్ తేజ తీసిన జై సినిమాలో నవదీప్ పక్కన హీరోయిన్ గా నటించింది సంతోషిణి.ఆ తర్వాత నువ్వు వస్తానంటే నేనొద్దంటానా మూవీలో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసింది.
అయితే సంతోషిణి శ్రీకర్ ని పెళ్లి చేసుకొని లైఫ్ లో తాను సెటిల్ అయింది.ఇలా చాలా మంది ఆర్టిస్ట్ లు ఇండస్ట్రీ కి వచ్చి సినిమాలు చేసి సినిమా ఇండస్ట్రీ కి సంభందించిన నటులనే పెళ్లి చేసుకొని సెట్ అవుతున్నారు.
అయితే ప్రసాద్ బాబు అప్పుడప్పుడు చిరంజీవి తో కలిసి మాట్లాడుకుంటారని చిరంజీవి అంత ఎత్తుకి ఎదిగిన ఎప్పుడు తమని మర్చిపోలేదని ప్రసాద్ బాబు ఎప్పుడు చెప్తుంటారు.చిరంజీవి కూడా చాలా ఇంటర్వ్యూల్లో నారాయణ రావు, సుధాకర్, ప్రసాద్ బాబులా గురించి వాళ్ళు చెన్నై లో పడిన ఇబ్బందుల గురించి చాలాసార్లు చెప్పారు.
చిరంజీవి వీలైనంత వరకు తనకి సంబందించిన వాళ్ళని ఎప్పుడు ఆదరిస్తారని అయన చాలా మంచివారని సుధాకర్ నారాయణ రావు లు కూడా చాలా సార్లు చెప్పారు.ఇప్పుడు దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఇండస్ట్రీ కి సంబందించిన పెద్ద దిక్కు చిరంజీవి అయి అంత చూసుకుంటున్నారు…
.