ప్రస్తుత వర్షాకాలంలో ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఏదో ఒక సమస్య చుట్టేస్తుంది.వర్షాకాలం ( Rainy season )వ్యాధుల కాలం.
అంటు వ్యాధులు ఈ సీజన్లోనే అధికంగా వ్యాప్తి చెందుతాయి.ఇక విష జ్వరాల గురించి చెప్పక్కర్లేదు.
అందుకే వర్షాకాలంలో కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండమని నిపుణులు చెబుతుంటారు.అయితే ఈ సీజన్ లో మన ఆరోగ్యానికి కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే స్మూతీ మీ ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది.అనేక జబ్బులకు అడ్డుకట్టలా నిలుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బీట్ రూట్‌ను( Beet Root ) తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక కప్పు బొప్పాయి( Papaya ) పండు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో బీట్ రూట్ ముక్కలు, బొప్పాయి పండు ముక్కలు వేసుకోవాలి.
అలాగే రెండు అల్లం స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ ఫ్రెష్ హోమ్ మేడ్ కొబ్బరి పాలు( Coconut Milk ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
తద్వారా మన స్మూతీ సిద్ధమవుతుంది.

ఈ స్మూతీలో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ కలిపి తీసుకోవాలి.ప్రస్తుత వర్షాకాలంలో ప్రతిరోజు ఈ స్మూతీని కనుక తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ఈ స్మూతీ ఇమ్యూనిటీ ౠస్టర్ గా పనిచేస్తుంది.
ఈ స్మూతీ డైట్ లో ఉంటే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.రక్తహీనత దూరం అవుతుంది.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల బారిన పడితే చాలా త్వరగా రికవరీ అవుతారు.
అలాగే ఈ స్మూతీ శరీరంలో క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది.కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.రక్తపోటును అదుపులో ఉంచుతుంది.అలాగే ఈ స్మూతీని రెగ్యులర్ గా తీసుకుంటే జ్ఞాపకశక్తి ఆలోచన శక్తి సైతం రెట్టింపు అవుతాయి.