ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అనగానే ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం టక్కున గుర్తొస్తాయి.సెకెన్ల వ్యవధిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీటి ద్వారా మనీ సెండ్ చేసుకోవచ్చు.
ఇప్పుడటంలే చాలా మనీ ట్రాన్స్ ఫర్ యాప్స్ వచ్చాయి కానీ.కొంత కాలం క్రితం పేటీఎం హవా నడిచింది.
డిజిటల్ చెల్లింపుల్లో నెంబర్ వన్ గా దూసుకుపోయింది.ఇంతకీ ఈ పేటీఎం ఎవరు? ఎలా మొదలు పెట్టారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పేటీఎం ఫ్లాట్ ఫామ్ రూపకర్త విజయ్ శేఖర్ శర్మ.దేశంలోనే డిజిటల్ చెల్లింపుల రంగాన్ని ఓ మలుపు తిప్పిన వ్యక్తి.అద్భుతాలు సాధించే వ్యక్తులు మనలాగే, మనతోనే ఉంటారనే విషయాన్ని నిరూపించాడు విజయ్.ఆయన వినూత్న ఆలోచనలు ఎన్నో డిజిటల్ పేమెంట్ యాప్స్ కు పునాది అయ్యాయి.
ఉత్తర ప్రదేశ్ అలిఘర్ లోని ఓ హిందీ మీడియం పాఠశాలలో విజయ్ చదవుకున్నాడు.
ఇంగ్లీష్ ఆయనకు సరిగా వచ్చేది కాదు.ఎలాగైనా నేర్చుకోవాలి అనుకున్నాడు.ఇంగ్లీష్ పాటలు వింటూ.
హిందీ నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్ లేట్ చేసిన బుక్స్ చదువుతూ మొత్తం మీద ఆంగ్ల భాషపై గట్టి పట్టు సాధించాడు.
పేటీఎం ఒక్కటే కాదు.
తను కాలేజ్ లో చదువుతున్నప్పుడే indiasite.net వెబ్సైట్ ను స్థాపించాడు.రెండు సంవత్సరాల తర్వాత దాన్ని 7 కోట్ల రూపాయలకు అమ్మాడు.2000 సంవత్సరంలో One97 కమ్యూనికేషన్స్ ప్రారంభించాడు.న్యూస్, క్రికెట్ స్కోర్స్, రింగ్ టోన్స్ , జోక్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ ఈ సైట్ ద్వారా అందించాడు.
ఆ తర్వాత 2010లో పేటీఎంకు శ్రీకారం చుట్టాడు.ఈ యాప్ తో కనీవినీ ఎరుగని రీతిలో సక్సెస్ అయ్యాడు.1.3 బిలియన్ డాలర్లతో ఇండియాలోనే యంగెస్ట్ బిలియనీర్ గా ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ప్లేస్ కొట్టేశాడు.ప్రస్తుతం భారత్ లో 62వ ధనవంతుడిగా విజయ్ కొనసాగుతున్నాడు.