2023 జనవరిలో శ్రీవారి సన్నిధిలో జరిగే విశేష పర్వదినాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుమల పుణ్యక్షేత్రానికి దేశంలోని చాలా రాష్ట్రాల నుంచి ప్రతి రోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీవారికి దర్శనాలు పూజలు చేస్తూ ఉంటారు.తిరుమల శ్రీవారినీ వేల సంఖ్యలో భక్తులు ప్రతిరోజు వస్తూ ఉండడం వల్ల శ్రీవారి దేవాలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది.ఇంకా చెప్పాలంటే 2002వ సంవత్సరంలో శ్రీవారిని దాదాపు మూడు కోట్ల మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం.2023 జనవరిలో శ్రీవారి సన్నిధిలో జరిగే విశేష పర్వదినాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉండడం వల్ల భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

 2023 January Special Festivals Tirumala Sri Venkateswara Swamy Details, 2023 Jan-TeluguStop.com

జనవరి 2వ తేదీన శ్రీవారి సన్న రథోత్సవం మూడవ తేదీన పుష్కరిణి తీర్థ ముక్కోటి శ్రీవారి చక్రస్థానం వైభవంగా జరిగినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

ఇంకా చెప్పాలంటే జనవరి ఏడవ తేదీన శ్రీవారి ఆలయంలో ప్రణాళికలహ మహోత్సవం ఏడవ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఆండాళ్ నిరాక ఉత్సవం నిర్వహిస్తున్నట్లు దేవాలయ ప్రముఖ అధికారులు వెల్లడించారు.

జనవరి 16వ తేదీన తిరుమల నంబి సన్నిధికి వేంచేపు, శ్రీ గోదాపరిణయోత్సవం 28వ తేదీన రథసప్తమి వేడుకలు చేస్తున్నట్లు దేవాలయాల ముఖ్య అధికారులు వెల్లడించారు.వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు కృష్ణ తేజ విశ్రాంతి గృహం వద్ద రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు వల్ల భక్తులు ఏటీసీ సర్కిల్ వద్ద శ్రీవాణి టికెట్లు అలా భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 మెయిన్ గేట్ వద్ద రిపోర్ట్ చేసేలా ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చుసుకున్నమని అదనపు ఈవో వీరబ్రహ్మం మీడియాకు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube