ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56
సూర్యాస్తమయం: సాయంత్రం 06.48
రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు
అమృత ఘడియలు: ఉ.10.30 నుంచి 12.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో సరదాగా బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీ ఆదాయం కన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తారు.కానీ తిరిగి సంపాదించే సోమత మీలో ఉంటుంది.
వృషభం:
ఈరోజు మీకు ఆర్థిక పరమైన విషయాలలో మీరు స్నేహితుల సహాయాన్ని పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఆలోచనలు చేయడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
మిథునం:
ఈరోజు విద్యార్థులు దేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటం మంచిది.బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీ ఇంటికి ఈరోజు అనుకోకుండా బంధువులు వస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీరు గతంలో పెట్టుబడిగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి యాత్రలకు వెళ్తారు.కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
సింహం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో అలసట ఎక్కువగా ఉంటుంది.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
కొన్ని సమస్యలు మొదలవుతాయి.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కన్య:
ఈరోజు మీరు కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.స్నేహితులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొందరు కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
తులా:
ఈరోజు తో మీ కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండడం మంచిది.ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చికం:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో ఎక్కువ సమయం గడుపుతారు.కొన్ని వ్యక్తిగత విషయాలు వారితో పంచుకోండి.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.
ధనస్సు:
ఈరోజు వ్యవసాయదారులు లాభాలు అందుకుంటారు.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో అనవసరమైన విషయాలకు వాదనలకు దిగకండి.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి కలసి అనుకున్న పనులు పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.లేనిపోని ఆలోచనలతో సతమతమవుతారు.ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కుంభం:
ఈరోజు మీరు బంధువులతో వారితో వాదనలకు దిగకండి.తొందరపడి మీ నిర్ణయాలు మార్చుకోకండి.ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.మీరు చేసిన పనిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
మీనం:
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఈరోజుతో కోర్టు సమస్యలన్నీ తీరిపోతాయి.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఇంటి నిర్మూలన గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
LATEST NEWS - TELUGU