ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే పోషకాహరమే కాదు నిద్ర కూడా ఎంతో అవసరం.అసలు ఆహారం లేకపోయినా కొద్ది రోజులు జీవించవచ్చు.
కానీ, నిద్రపోకుంటే మాత్రం జీవించలేము.కంటి నిండా నిద్ర లేకుంటే మానసిక ఆరోగ్యమే కాదు శారీరక ఆరోగ్యం సైతం తీవ్రంగా దెబ్బ తింటుంది.
అందుకే రోజుకు ఎనిమిది గంటలు ఖచ్చితంగా నిద్ర పోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అయితే కొందరు రాత్రుళ్లు మాత్రమే కాకుండా పగటి పూట కూడా పడుకుంటుంటారు.
ఖాళీ టైమ్ దొరికిందంటే చాలు కునుకు తీస్తుంటారు.
నిద్ర ఆరోగ్యానికి మంచిదే.
కానీ, దానికీ కొన్ని హద్దులు ఉంటాయి.అవసరానికి మించి నిద్రపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా తలనొప్పిగా ఉన్నప్పుడు కాసేపు పడుకుంటే.
మంచి రిలీఫ్ లభిస్తుంది.తలనొప్పికి నిద్ర ఓ న్యాచురల్ మెడిసిన్‌లా పని చేస్తుంది.కానీ, అదే నిద్ర తలనొప్పి కారణం కూడా అవుతుంది.అవును ఫ్రీ టైమ్ దొరికినప్పుడల్లా కునుకు తీసేవారు.తరచూ తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యను ఫేస్ చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే తరచూ నిద్రపోయే వ్యక్తులు ఎప్పుడూ బద్దకంగా ఉంటారు.
ఎందులోనూ యాక్టివ్‌గా పాల్గొనలేరు.ఏ పని చేయాలన్నా వెనకడుగు వేస్తుంటారు.
అతిగా నిద్ర పోవడం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది.ఫలితంగా జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తి.
రెండు తగ్గిపోతాయి.

అంతేకాదు, ఖాళీ టైమ్ దొరికినప్పుడల్లా కునుకు తీసే వారిలో గుండె పోటు, మధుమేహం, అధిక బరువు, డిప్రెషన్, వెన్నునొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి.కాబట్టి, ఇకనైనా తరచూ న్యాప్ వేసే అలవాటను వదులుకోండి.అందుకోసం ఇంట్రస్టింగ్ బుక్స్ చదవడం, రకరకాల వంటలను ప్రయత్నించడం, కుట్లు అల్లికలు, బొమ్మలు గీయడం, పెయింటింగ్ ఇలా ఖాళీ టైమ్‌లో ఏదో ఒక పనిపై మనసును మల్లిస్తే.
నిద్ర ఆలోచన రాకుండా ఉంటుంది.