పొడవైన జుట్టు కావాలని చాలా మంది కోలుకుంటారు.కానీ, నేటి టెక్నాలజీ కాలంలో పొడుగు జుట్టు అమ్మాయిలే కరువైయ్యారు.
కాలుష్యం, ఎలక్ట్రానిక్ గడ్జెట్స్‌ను అధికంగా వినియోగించడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడటం, పోషకాల కొరత, హార్మోన్ ఛేంజస్ ఇలా రకరకాల కారణాల వల్ల చాలా మందిలో హెయిర్ గ్రోత్ ఆగి పోతోంది.అయితే చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్యాక్‌ను ట్రై చేస్తే గనుక ఖచ్చితంగా పొడవైన జుట్టును తమ సొంత చేసుకో వచ్చు.
మరి టైమ్ వేస్ట్ చేయకుండా ఈ సూపర్ హెయిర్ ప్యాక్ ఏంటో చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు ఎగ్ వైట్స్ వేసుకుని బాగా కలపండి.
ఇప్పుడు ఇందులో మూడు స్పూన్ల కొబ్బరి నూనె, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ మరియు ఒక స్పూన్ లావెండర్ ఆయిల్ యాడ్ చేసుకుని కలిసేలా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు మీరు రోజూ వారీ వాడే ఆయిల్‌ను తలకు పెట్టుకుని.
అపై తయారు చేసుకున్న ప్యాక్ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోండి.
అనంతరం గంట పాటు డ్రై అవ్వ నిచ్చి.
అప్పుడు కెమికల్స్ తక్కువగా షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయండి.నాలుగు రోజులకు ఒక సారి ఈ ప్యాక్‌ను ట్రై చేస్తే గనుక.
ఖచ్చితంగా జుట్టు పెరగడాన్ని మీరు గమనిస్తారు.ఎగ్ వైట్, లావెండర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మరియు కొకొనట్ ఆయిల్.
ఈ నాలుగిటిలోనూ ఉండే కొన్ని ప్రత్యేకమైన పోషకాలు జుట్టుకు మంచి పోషణను అందించి పొడవుగా పెరిగేందుకు ప్రోత్సహిస్తాయి.
అలాగే ఈ సూపర్ ప్యాక్ వల్ల జుట్టు రాలడం తగ్గు ముఖం పడుతుంది.హెయిర్ డ్యామేజ్ సమస్య దరి చేరకుండా ఉంటుంది.మరియు డ్రై హెయిర్ సమస్యతో బాధ పడే వారు కూడా ఈ ప్యాక్‌ను ట్రై చేస్తే.
కేశాలు ఎల్లప్పుడూ స్మూత్ అండ్ సాప్ట్‌గా మెరుస్తాయి.