టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr.NTR ) చేతుల్లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.అందులో ఇప్పటికీ వార 2 సినిమా కూడా ఒకటి.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయిన విషయం తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన సినిమాలో హీరోగా నటించారు ఎన్టీఆర్.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.వార్ 2 మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.

తారక్ నటిస్తున్న సినిమాలలో మరొక సినిమా ప్రశాంత్ నీల్( Prashant Neel ) మూవీ.ఈ డ్రాగన్ మూవీ లో ఎన్టీఆర్ పాల్గొన బోతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ఈ రెండు సినిమాల తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో దేవర 2 చేయనున్నాడు ఎన్టీఆర్.
వీటితో పాటు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ తో ఒక మూవీ కమిట్ అయ్యాడు.ఎన్టీఆర్, నెల్సన్ కాంబినేషన్ లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ( Sitara Entertainments Banner )పై నిర్మాత నాగవంశీ ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇక ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.అదేంటంటే మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని లాక్ చేశారట.నెల్సన్ సినిమాలకు ఫస్ట్ నుండి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడట.ప్రస్తుతం నెల్సన్ డైరెక్ట్ చేస్తున్న జైలర్ 2 ( Jailer 2 )కి కూడా అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్.ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కి కూడా లాక్ అయినట్లు సమాచారం.
కాగా గత ఏడాది విడుదల అయినా ఎన్టీఆర్ దేవర సినిమాకు అనిరుధ్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి కాంబో రిపీట్ కాబోతుందట.
ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ విషయం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.