ఘజియాబాద్‌కు( Ghaziabad ) చెందిన ఒక యువతి పేరు దియా కహాలి.( Diya Kahali ) ఈమె సైకాలజీ( Psychology ) చదువుతోంది.
ఇటీవల ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైలులో ఇంటర్న్‌షిప్( Tihar Jail Intern ) చేసింది.అదీ మామూలు చోట కాదు.
కేవలం మగ ఖైదీలు ఉండే బ్లాక్‌లో.రెండు వారాల పాటు అక్కడ పనిచేసిన దియా, తాను కళ్లారా ఏం చూసిందో, ఎలాంటి అనుభవాలు ఎదుర్కొందో సోషల్ మీడియాలో పంచుకుంది.“సర్వైవింగ్ అండ్ థ్రైవింగ్: మై రియాలిటీ అస్ ఏ సైకాలజీ ట్రైనీ ఎట్ టీహార్ ప్రైజన్ కాంప్లెక్స్” అనే పేరుతో ఆమె రాసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
తన పోస్ట్‌లో దియా అసలు విషయం చెప్పింది.
మొత్తం మగవాళ్లు ఉండే యూనిట్‌లో తాను ఒక్కదాన్నే అమ్మాయిని.ఒక్క మహిళా గార్డు తప్ప చుట్టూ అంతా మగవాళ్లే ఈ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుందో వివరించింది.“ఒకేసారి అందరికీ కనిపిస్తాం, కానీ ఎవరూ పట్టించుకోనట్లు అనిపిస్తుంది” అని ఆమె రాసింది.ఖైదీలు ఆమెను సీరియస్‌గా తీసుకోలేదట.
కొన్నిసార్లు సిబ్బంది కూడా పట్టించుకోలేదని, ఎప్పుడూ ఎవరో చూస్తున్నట్లే అనిపించిందని దియా తన అనుభవాన్ని పంచుకుంది.

ఈ ఇంటర్న్‌షిప్‌కు సరైన పద్ధతి లేదని కూడా ఆమె చెప్పింది.ఈ ప్రోగ్రామ్ ఇంకా కొత్తగా ఉన్నందున, సహాయం కోసం పదేపదే అడగాల్సి వచ్చిందని, సూచనలను మళ్లీ మళ్లీ సరిచూసుకోవాల్సి వచ్చిందని వివరించింది.“మీ భద్రతకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వండి” అని ఆమె నొక్కి చెప్పింది.ఏదైనా పరిస్థితి సురక్షితంగా లేదనిపిస్తే, వెంటనే గార్డు సహాయం తీసుకోవాలని సూచించింది.
దియా చేయాల్సిన పనులు ఏంటంటే, ఖైదీలను ఇంటర్వ్యూ చేయడం, వాళ్ల కష్టాలు, కథలు వినడం, వాటిపై రిపోర్టులు రాయడం.
అయితే, చాలా మంది ఖైదీలు మౌనంగా ఉండేవారట, కొందరు అనుమానంగా చూసేవారట, మరికొందరు డామినేట్ చేసేలా మాట్లాడేవారట.వారితో నమ్మకాన్ని పెంచుకోవడానికి, దియా ఉదాహరణలు చెబుతూ, వ్యక్తిగతంగా మాట్లాడించే ప్రయత్నం చేసిందట.
ముఖ్యంగా ఆమెకు హిందీ అంత అనర్గళంగా రాకపోయినా, ఈ పద్ధతులు వాడిందట.

ఇన్ని కష్టాలున్నా, ఆమెకు సీనియర్ పోలీసు అధికారుల నుంచి మంచి సపోర్ట్ లభించిందని దియా చెప్పింది.వాళ్ల దయ, ఆమె పరిస్థితిని అర్థం చేసుకోవడం ఆమెకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందట.“ఎప్పుడూ కొత్త పరిచయాలు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది” అని ఆమె ఒక ముఖ్యమైన సలహా ఇచ్చింది.
భవిష్యత్తులో తీహార్‌లో ఇంటర్న్‌షిప్ చేయాలనుకునేవారికి కొన్ని సూచనలు కూడా ఇచ్చింది దియా.ఓపికగా ఉండాలని, పరిస్థితులకు తగ్గట్టుగా మారాలని, ముఖ్యంగా గేట్ నెం.3 దగ్గర అవసరమైన పత్రాలన్నీ తప్పకుండా తీసుకెళ్లాలని చెప్పింది.
మొత్తానికి ఆ అనుభవం చాలా కష్టమైనదే అయినా, ఎంతో నేర్పించిందని దియా అంగీకరించింది.“పరిస్థితులకు తగ్గట్టుగా మారడం, వేగంగా ఆలోచించడం, అలాగే మనుషులతో మనసుకు హత్తుకునేలా ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్చుకుంటారు.ఇది ఏ క్లాస్‌రూమ్‌లోనూ నేర్పరు” అని దియా తన పోస్ట్‌లో ముగించింది.
ఆమె రాసిన నిజాయితీతో కూడిన ఈ పోస్ట్‌కు లింక్డ్ఇన్‌లో 500కు పైగా లైకులు, ఎంతో మంది నుంచి అభినందనలు, సపోర్ట్ లభించాయి.ఆమె ధైర్యాన్ని, తెగువను, విశ్లేషణ సామర్థ్యాన్ని నెటిజన్లు ప్రశంసించారు.







