బట్టతల( Bald ).ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పురుషులను కలవర పెట్టే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
బట్టతల ఉండటమనేది అంత చెడ్డ విషయమేమీ కాకపోయినా.దాని వల్ల పురుషులు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.
ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు.ముఖ్యంగా పెళ్లి కాకుండానే బట్టతల వస్తే ఇక వారి బాధ వర్ణనాతీతం.
చిన్న వయసులోనే బట్టతల రావడం వల్ల వయస్సు మీద పడిన వారిలా కనిపిస్తుంటారు.అందుకే చాలామంది పురుషులు బట్టతలకు దూరంగా ఉండాలని భావిస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి.ఈ రెమెడీ బట్టతల వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.తలపై జుట్టును ఒత్తుగా మారుస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం పురుషులకు ఎంతగానో ఉపయోగపడే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక ఉల్లిపాయను( onion ) తీసుకుని తొక్క తీయకుండా ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.

అలాగే రెండు స్పూన్లు మెంతులు( fenugreek ) వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అయ్యాక మూడు నుంచి నాలుగు మందారం పువ్వులు( Hibiscus flowers ) వేసి ఐదు నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మెంతులు కూడా వేసి మరో 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

ఆపై ఒక స్ప్రే బాటిల్ లో ఈ వాటర్ ను నింపుకొని స్కాల్ప్ కు ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి.30 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.పురుషులు వారానికి ఒక్కసారి ఈ విధంగా చేశారంటే బట్టతల భయమే అక్కర్లేదు.మందారం, ఉల్లి, మెంతుల్లో ఉండే పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడతాయి.హెయిర్ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి.పల్చగా ఉన్న జుట్టును ఒత్తుగా మారుస్తాయి.
బట్టతల వచ్చే రిస్క్ ను తగ్గిస్తాయి.కాబట్టి పురుషులు బట్టతలకు దూరంగా ఉండాలనుకుంటే తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని తరచూ పాటిస్తూ ఉండండి.