నీటిలో ఉన్నప్పుడు కాళ్లు చేతులు ముడతలు ఎందుకు పడతాయో తెలుసా..?

నీటిలో ఎక్కువసేపు ఉన్నవారు, వాటర్ గేమ్స్ ఆడిన వారి కాళ్లు, చేతుల వేళ్లపై చర్మం ముడతలు( Wrinkles on Fingers Toes ) పడినట్లు కనిపిస్తుంది.ఇది చాలామందికి తెలిసిన విషయమే.

 Why Do Fingers And Toes Wrinkle In Water,hyperkeratosis ,keratin,toes,wrinkles,s-TeluguStop.com

అయితే అలా ఎందుకు అవుతుందో ఎవరు ఎప్పుడూ ఆలోచించి ఉండరు.నీటిలో ఉండే చర్మం ఎందుకు ముడతలు పడుతుంది.

దీని వెనుక అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కేవలం చేతి, కాలి వేళ్ళు మాత్రమే ఇలా ఎందుకు అవుతాయి.

మిగతా చర్మం ఎందుకు ముడతలు పడదు.

Telugu Tips, Hyperkeratosis, Keratin, Scientific, Telugu, Toes, Wrinkles-Telugu

మానవ శరీరంలో అతి పెద్ద అవయవం చర్మం.శరీరానికి చర్మమే రక్షణ కల్పిస్తుంది.లోపల ఉన్న అవయవాలను ఎప్పుడు కాపాడుతుంది.

కండరాలు ఎముకలకు రక్షణ కల్పిస్తుంది.లోపల ఉన్న శరీర వ్యవస్థ సక్రమంగా సాగేలా, రక్తం ప్రవహించేలా అవయవాలు అన్ని తమ తమ పనులు నిర్వహించేలా రక్షణగా చర్మం నిలుస్తుంది.

చర్మానికి దెబ్బ తగిలితే తనకు తను చికిత్స చేసుకుంటుంది.కణాలను ఉత్పత్తి చేసి గాయాల వల్ల ఊడిపోయిన చర్మాన్ని తిరిగి నిర్మించుకుంటుంది.

Telugu Tips, Hyperkeratosis, Keratin, Scientific, Telugu, Toes, Wrinkles-Telugu

ఇంకా చెప్పాలంటే నీటిలో ఎక్కువసేపు ఉంటే మిగతా చర్మం ఎప్పటిలాగే సాధారణంగా ఉంటుంది.కానీ కాళ్లు, చేతుల వెళ్ళు మాత్రమే ముడతలు పడతాయి.వాస్తవానికి కెరాటిన్ అనే ప్రోటీన్ పదార్థం చేతులు, కాళ్లలో ఎక్కువగా ఉంటుంది.కెరాటిన్( Keratin ) చేతులు కాళ్లలోనే ఎక్కువగా ఉండటం వల్ల అక్కడి చర్మం మాత్రమే ముడతలు పడుతుంది.

నీటిలో చర్మం ముడుతలు పడడానికి పట్టే సమయం వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూ ఉంటుంది.కొంతమందికి కొన్ని నిమిషాల తర్వాత ముడతలు పడటం మొదలవుతుంది.మరికొందరికి అసలు ముడతలు పడదు.నీరు కూడా చర్మం ముడతలు పడడంపై ప్రభావితం చూపిస్తుంది.

చల్లని నీటి కంటే వేడి నీళ్ల వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube