1.శ్రీశైలం జలాశయంలో వరద నీరు
కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది.ప్రాజెక్టు ఇన్ ఫ్లో 12,993 క్యూసెక్కులు ఉంది.అవుట్ ఫ్లో 19 వేల క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
2.కెసిఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు రాలేదా అంటూ లేఖలో ప్రశ్నించారు.
3.అతి భారీ వర్షాలు
రాబోయే ఐదు రోజుల్లో పలు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
4.ఢిల్లీలో కొనసాగుతున్న కేసీఆర్ పర్యటన
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది.నేడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి కేసీఆర్ వెళ్లనున్నారు.
5.కవిత పై రేవంత్ రెడ్డి విమర్శలు
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ చౌటుప్పల్ కాంగ్రెస్ నేత జీవన్రెడ్డి విమర్శలు చేశారు షుగర్ ఫ్యాక్టరీ మూసివేయించినందుకే కవిత ఓడిపోయారని జీవన్ రెడ్డి విమర్శించారు.
6.డి.ఎస్.పి ఎక్సైజ్ పోస్టులకు ఎత్తు తగ్గింపు
టిఎస్పిఎస్సి నిర్వహించే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ , అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులకు ఎత్తును తగ్గించింది.యూపీఎస్పీ భర్తీ చేసే ఐపీఎస్ పోస్టుల మాదిరిగానే పురుషులకు 165 సెంటీ మీటర్లు మహిళలకు 150 సెంటీమీటర్లు గా ఖరారు చేసింది.
7.చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని బాబు వ్యాఖ్యానించారు.
8.వైసీపీ నాయకులకు జెసి ప్రభాకర్ రెడ్డి సెటైర్లు
గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం పై జేసీ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.గడపకు వెళితే కథలు రాళ్లతో కొట్టే రోజులు త్వరలో వస్తాయి అని ఎద్దేవా చేశారు.
9.నేడు జీవ వైవిధ్య దినోత్సవం
అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం ను నేడు కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం లో నిర్వహిస్తున్నట్లు ఏపీ బయోడైవర్సిటీ బోర్డు గౌరవ అధ్యక్షుడు బీఎంకే రెడ్డి తెలిపారు.
10.ఏపీ ఉద్యోగ పోరాట సమితి నిరసన
గ్రూప్ ఫోర్ దేవాలయ అధికారులు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తు తీసుకుని ఐదు నెలలు అవుతున్నా.ఇంతవరకు పరీక్ష తేదీలను ప్రకటించ లేదంటూ ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
11.వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పై హత్య కేసు నమోదు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పై కేసు నమోదు చేశామని కాకినాడ జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు.
12.రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
ఎఫ్ 3 సినిమా మే 27వ తేదీన విడుదలవుతోంది.ఈ సినిమా హిట్ కాకపోతే తాను సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని సినీ హీరో కమెడియన్ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు.
13.తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు
తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
14.పెట్రోల్ ,డీజిల్ పై వ్యాట్ తగ్గించాలి : బండి సంజయ్
తెలంగాణలో పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
15.భారత్ లో కరోనా
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2226 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
16.నేడు దావోస్ లో జగన్ పర్యటన
నేటి నుంచి ఈనెల 26 వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూ ఈ ఎఫ్ సదస్సు జరగనుంది.ఈ సదస్సులో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు.
17.ఏపీ ల పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఏపీ లో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.నిన్న మండపేటలో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
18.పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న జల శక్తి అధికారులు
నేడు పోలవరం ప్రాజెక్టును కేంద్ర జల శక్తి అధికారులు సందర్శించనున్నారు.
19.మంకీ ఫాక్స్ పై కేరళ ప్రభుత్వం అలర్ట్
ప్రపంచవ్యాప్తంగా ఉధృతమవుతున్న మంకీ ఫాక్స్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.కేరళ ప్రభుత్వం దీనిపై అలర్ట్ అయింది .ఈ మేరకు కేరళలోని అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలకు దీనిపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 47,050 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,330