చర్మ ఛాయను పెంచే బాదం.. ఇలా వాడితే మరెన్నో బెనిఫిట్స్ మీ సొంతం!

బాదం.అద్భుతమైన నట్స్ లో ఒకటి.

 Best Way To Use Almonds For Skin Whitening!   Almonds,  Saffron Flower ,   Almon-TeluguStop.com

చాలా మందికి రోజు ఉదయం నానబెట్టిన బాదం పప్పు తినే అలవాటు ఉంటుంది.హెల్త్, ఫిట్నెస్ పై శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా తమ రెగ్యులర్ డైట్ లో బాదం పప్పును చేర్చుకుంటారు.

వెయిట్ లాస్ నుంచి వివిధ రకాల జబ్బులకు చెక్ పెట్టే వ‌ర‌కు బాదం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.అలాగే చర్మ సౌందర్యానికి కూడా బాదం హెల్ప్ చేస్తుంది.

ముఖ్యంగా చర్మ ఛాయను పెంచడానికి బాదం  సహాయపడుతుంది.అందుకోసం బాదం పప్పును ఎలా వాడాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Almonds, Tips, Latest, Skin Care, Skin Care Tips, Skin, Skin Remedy-Telug

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఐదు బాదం పప్పులు( Almonds ) వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు పాలు, అరకప్పు నీళ్లు పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే నానబెట్టి పొట్టు తొలగించిన బాదం పప్పును అందులో వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, చిటికెడు కుంకుమ పువ్వు( Saffron flower ) వేసి దాదాపు 15 నిమిషాల వరకు ఉడికించాలి.

Telugu Almonds, Tips, Latest, Skin Care, Skin Care Tips, Skin, Skin Remedy-Telug

రైస్( Rice ) పూర్తిగా ఉడికి పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఇలా ఉడికించిన ప‌దార్థాల‌ను పూర్తిగా చల్లారపెట్టి ఆపై మిక్సీ జార్ లో స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పేస్ట్ లో రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్( Vitamin E oil ) వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు చేతులకు అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలిఅనంతరం వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ స్కిన్ టోన్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. చ‌ర్మం తెల్ల‌గా మారుతుంది.మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ కంటే పవర్ ఫుల్ గా ఈ రెమెడీ పని చేస్తుంది.అలాగే ఈ రెమెడీ వల్ల వృద్ధాప్య ఛాయలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మెరుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube