సినిమాల్లో నటించడం అంటే చాలా ఈజీ అని అనుకుంటున్నారు అందరు.రంగుల ప్రపంచం, దానిలో విహరిద్దామని ఎంతో మంది చాలా ఆశలు పెట్టుకుని సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు.
అయితే సినిమాలో నటించాలి అనే కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు.దానికి తగ్గ బాడీ మెయింటనెన్స్ ఉండాలి.
సినిమా సినిమాకి క్యారెక్టర్ ను బట్టి శరీర ఆకృతిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి.టోటల్ గా చెప్పాలంటే మన బాడీ అనేది మన కంట్రోల్ లో ఉండాలి.
ఏది పడితే అది తినకూడదు.బాడీ ఫిటినెస్ అనేది చాలా ముఖ్యం.
అందుకనే సినిమాల్లో చాలా మంది హీరోలు బరువు తగ్గడం మనం చూస్తున్నాము.ఒకప్పుడు సిక్స్ ప్యాక్ ట్రెండ్ కూడా కొనసాగింది.
చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్ కోసం ఎన్నో వర్క్ ఔట్స్ కూడా చేసారు.అయితే ఇప్పుడు మనం అలాంటి కోవకి చెందిన ఒక హీరో గురించి తెలుసుకుందాం.!!
ఒకప్పుడు కామెడీ క్యారెక్టర్స్ లో ఎంతో మంచి పేరు తెచ్చుకుని, తర్వాత సినిమాల్లో హీరోగా నటించిన సునీల్ గురించి.అప్పట్లో సునీల్ సైతం సిక్స్ ప్యాక్ సంపాదించుకుని సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
అయితే హీరో అవ్వడం కోసం తన బాడీని చాలా వరకు తగ్గించుకున్నాడు.కానీ లాక్ డౌన్ సమయంలో సినిమాలు లేక, ఇంట్లోనే మూడు నెలల పాటు తిని కూర్చోవవడం వలన మళ్ళి బరువు పెరిగాడు సునీల్.
దీంతో మునపటి శరీర ఆకృతి కోసం మళ్ళి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.జిమ్ లో ఎన్ని గంటలు వర్క్ అవుట్ చేసిన గాని ఫలితం కనిపించకపోవడంతో ప్రకృతి ఆశ్రమంలో చేరాడట సునీల్.
అయితే ఎవ్వరు ఊహించని విదంగా కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లోనే ఏడున్నర కిలోల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

సునీల్ జీవితంలో జరిగిన ఈ 9 రోజుల ప్రయాణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.సునీల్ 1996 నుండి ప్రకృతి వైద్యాన్ని నమ్ముకున్నాడట.కానీ సినిమాల్లో బిజీగా ఉండటంతో మధ్యలోనే వదిలేసాడు.
జిమ్ లో ఎన్ని వర్క్ ఔట్లు చేసిన గాని ఫలితం లేకపోవడంతో ప్రకృతి చికిత్స మీద ఆధారపడ్డాడు సునీల్.మొదటగా ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళడానికి భయపడ్డాడట.
తరువాత దైర్యం చేసి జాయిన్ అయ్యాడు.వచ్చిన మొదటి రోజే అక్కడ పద్ధతులు, ఉపవాస నిబంధనలు గురించి తెలుసుకున్న సునీల్ అక్కడ ఒక్కరోజు కూడా ఉండలేను అనుకున్నాడట.
కానీ 9 రోజుల పాటు ఒక్క మెతుకు తిండి తినకుండా, కేవలం మంచి నీళ్లు, మూడు చుక్కల తేనే మాత్రమే తాగి అనుకున్నదాని కంటే ఎక్కువ బరువు తగ్గాడట సునీల్.ఇలాంటి ఆహారం ఎంత తీసుకున్న గాని కొవ్వు అనేది బాడీ లో చేరదంట.
ఒకవేళ కడుపులో ఆకలేసినప్పుడు మూడు చుక్కల తేనెను , నిమ్మచెక్కతో కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సినంత ఎనర్జీ లభిస్తుందని సునీల్ తెలిపారు.అయితే శరీరానికి శక్తి కోసం చేపలు, నాన్ వెజ్ వంటి మాంసాహారం తీసుకున్నప్పటి కంటే ఈ తేనె, నిమ్మ చెక్క ఎంతో ఎనర్జిటిక్ గా అనిపిస్తుందని అయన తెలిపారు.
ఎంతో దీన స్థితి అనుభవించాను అని, అలాగే ఏమి తినకుండా ఉన్న పరిస్థితిని కూడా తట్టుకోగలిగాను అని సునీల్ తన జీవితంలో జరిగిన ఆ తొమ్మిది రోజుల గురించి తెలిపారు.!!
.