1.మహేందర్ రెడ్డి ఆరోగ్యం పై ఐటీ అధికారుల ఆరా
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఐటి అధికారులు ఆరా తీస్తున్నారు.
2.ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఈరోజు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
3.ఈడి విచారణకు హాజరైన కాంగ్రెస్ కీలక నేత
నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల ముందు విచారణకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి అంజన్ కుమార్ యాదవ్ హాజరయ్యారు.
4.ఘనంగా సత్యసాయి జయంతి వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా 97వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.
5.బిగ్ బాస్ పై హై కోర్ట్ కు నారాయణ
బిగ్ బాస్ షోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో సిపిఐ నారాయణ పిటిషన్ దాఖలు చేశారు.
6.మహిళల కోసం మరో హెల్ప్ లైన్
తమిళనాడులోని మహిళల రక్షణ కోసం హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటయింది.181 హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటయింది.
7.తిరుమల సమాచారం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.స్వామి వారి దర్శనం కోసం 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
8.జగన్ కు సిపిఐ రామకృష్ణ లేఖ
ఏపీ సీఎం జగన్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.అనంతపురం జిల్లాలో రాఖీ పరిశ్రమ ఏర్పాటుకు తక్షణం చర్యలు చేపట్టాలని కోరుతూ రామకృష్ణ లేఖ రాశారు.
9.ఏపీలో పొత్తులపై నారాయణ కామెంట్స్
ఏపీలో రాజకీయ పార్టీల మధ్య కొత్త వ్యవహారంపై సిపిఐ నేత నారాయణ కామెంట్ చేశారు.వైసీపీ బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని , ఇష్టం లేకపోయినా టిడిపి, జనసేన, వామపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలని నారాయణ కామెంట్ చేశారు.
10.బండి సంజయ్ పాదయాత్ర
నవంబర్ 28 నుంచి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాద యాత్రను ప్రారంభించనున్నారు.
11.యువరాజ్ సింగ్ కు గోవా ప్రభుత్వం నోటీసులు
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు గోవా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.ప్రభుత్వ అనుమతి లేకుండా గోవాలోని తన ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు ఆన్లైన్ లో ప్రకటన ఇవ్వడంపై ఈ నోటీసులు జారీ అయ్యాయి.
12.కేజీఎఫ్ 2 రికార్డులను బ్రేక్ చేసిన కాంతార
కేజీ ఎఫ్ 2 రికార్డులను కాంతార సినిమా బ్రేక్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
13.కొనసాగుతున్న ఐటీ సోదాలు
తెలంగాణలో ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.షిఫ్ట్ ల వారీగా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
దీంతో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు అంతా భయాందోళనలో ఉన్నారు.ఇప్పటికే మంత్రి మల్లారెడ్డి కి సంబంధించిన ఆస్తులపై ఈడి అధికారులు తనిఖీలు చేపట్టారు.
14.శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన
ఏపీ సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా అనేక ప్రారంభోత్సవాలు , శంకుస్థాపనలు జగన్ చేపట్టారు.
15.ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను అంగీకరించేది లేదు
ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను అంగీకరించేది లేదని బిజెపి నేత విష్ణుకుమార్ రాజు అన్నారు.
16.ఢిల్లీకి మంత్రి విడదల రజనీ
ఏపి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడతల రజిని ఢిల్లీ లో వివిధ కార్యక్రమాల నిమిత్తం పర్యటిస్తున్నారు.
17.ఉప్పాడ తీరంలో అలల ఉధృతి
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కాకినాడలోని ఉప్పాడ సముద్ర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి.
18.అనంత పద్మనాభ స్వామి ఆలయంలో
నేడు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో దీపోత్సవం జరగనుంది .దీనికి భారీగా ఏర్పాట్లు చేశారు.
19.ఆన్లైన్ లో తిరుమల దర్శనం టికెట్ల
రేపు వయో వృద్దులు, వికలాంగుల దర్శనం టికెట్లను ఆన్లైన్ లో టీటీడీ విడుదల చేయనుంది.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 48,250 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 52,640
.