తమ ముఖ చర్మం ఎటువంటి మొటిమలు, మచ్చలు (Acne, scars)లేకుండా మృదువుగా కాంతివంతంగా మెరిసిపోతూ కనిపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.అందులో భాగంగానే రకరకాల చర్మ ఉత్పత్తులను వాడుతుంటారు.
ఖరీదైన బాత్ సోప్ ను ఉపయోగిస్తుంటారు.అయితే సూప్ కి బదులుగా రోజూ ఇప్పుడు చెప్పబోయే పౌడర్ ను ముఖానికి వాడితే మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం.
అందుకోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్ (Oats )వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకుని బౌల్ లోకి తీసుకోవాలి.ఆ తర్వాత అదే మిక్సీ జార్ లో పది నుంచి పదిహేను బాదం (Almonds)గింజలు, ఎనిమిది పిస్తా(pistachios) వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఓట్స్ పౌడర్ లో బాదం పిస్తా పౌడర్ వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్(Beet Root) పౌడర్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్, పావు టీ స్పూను యాలకుల పొడి వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
దాంతో మన పౌడర్ రెడీ అవుతుంది.ఒక బాక్స్ లో ఈ పౌడర్ ను స్టోర్ చేసుకోవాలి.

నిత్యం సోప్ కి బదులుగా ఈ పౌడర్ ను వన్ టీ స్పూన్ చొప్పున తీసుకుని వాటర్ లేదా రోజు వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ పౌడర్ ను వాడడం వల్ల ముఖ చర్మం చాలా ఆరోగ్యంగా మారుతుంది.కాంతివంతంగా మెరుస్తుంది.చర్మం లోతుగా శుభ్రం అవుతుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.