దిల్ రాజు( dil raju ) గురించి మనం ఇప్పటికే ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం.డబ్బు వస్తుంది అంటే అయన పేడ లో కూడా కాలు పెడతాడు.
అలా అని అతడు మొదటి నుంచి గోల్డెన్ లేదా సిల్వర్ స్పూన్ తో పుట్టలేదు.తొలిరోజుల్లో అందరు సినిమా కష్టాలు ఒకే విధంగా ఉంటాయి.
అందుకు దిల్ రాజు కి ఎలాంటి మినహాయింపు లేదు.తనకు జడ్జ్ చేసే పవర్ ఎక్కువ అందుకే తవరగా లక్కు ని గుప్పిట పట్టుకున్నాడు.
పైగా డిస్ట్రిబ్యూటర్ సిండికేట్ ని తన గుప్పిట పట్టుకోవడం లో సక్సెస్ అయ్యాడు.అతడు తెలంగాణ పేరు, సంస్కృతి, యాస వంటి వాటిపై సినిమా తీస్తున్నాడు అంటే ఒక్కరు కూడా నమ్మలేదు.

అందులో ఎదో లాభం లేనిదే దిల్ రాజు సినిమా చేయదు అని అందరి ఫీలింగ్.అనుకున్నట్టు గానే అతడి జడ్జి మెంట్ వర్క్ అవుట్ అయ్యింది.ఈ రోజు బలగం సక్సెస్ అయ్యింది.ప్రతి పల్లె, ప్రతి వాడ అతడి గురించే మాట్లాడుకుంటున్నారు.ఇక ప్రముఖ నిర్మాత రమేష్ రెడ్డి తుమ్మల( Producer Ramesh Reddy Thummala ) తన సోషల్ మీడియా లో దిల్ రాజు నైజాం గురించి కుండా బద్దలు కొట్టాడు.రమేష్ 2005 లో నా తల్లి తెలంగాణ అనే సినిమా చేస్తున్నప్పుడు అందరు ఆయనను చూసి నవ్వినవారే.
ఆ తర్వాత 2009 లో తెలంగాణ గోదావరి సినిమా టైం లో ను ఇలాంటి అవమానాలకు కొదవేమి లేదు.

ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయం లో రమేష్ దిల్ రాజు సహాయం కోరితే అలంటి సినిమాలు ఎవడు చూస్తాడు అంటి దిల్ రాజు రమేష్ ని అవమానించాడు.కానీ నేడు అదే దిల్ రాజు తెలంగాణ సంస్కృతి పై సినిమా తీస్తుంటే సంతోషంగా అంది అంటూ రమేష్ తన ఆవేదన పంచుకున్నారు.ఆలా అనే నేను ఏమి గొప్పవాణ్ణి కాదు దిల్ రాజు ని చూసి నవ్వినవాడినే.
ఎందుకంటే దిల్ రాజు కష్టపడుతున్న రోజులో పొద్దున్న టిఫిన్, రాత్రి భోజనం తన ఇంట్లోనే తినేవాడు.నా కంటే దిల్ రాజు వయసులో పెద్దవాడే.ఇక రమేష్ 2017 లో ది ఇండియన్ పోస్టుమ్యాన్ ( The Indian Postman ) అనే ఇంగ్లీష్ సినిమా తెలంగాణ పై తీసాడు.తెలంగాణ నేపధ్యం లో వచ్చిన మొదటి ఇంగ్లీష్ సినిమా ఇదే కావడం విశేషం.