పనీర్ బటర్ మసాలా వంటి నార్త్ ఇండియన్ డిష్ లు రుచిగా రావాలంటే... సింపుల్ చిట్కా

వంటింటిలో వంటలు చేసినప్పుడు సాధారణంగా డౌట్స్ రావటం సహజమే.అవి చిన్నవిగానే ఉంటాయి.

 How To Make Tasty North Indian Dishes-TeluguStop.com

కానీ వాటి కారణంగానే వంటల రుచి మారిపోతూ ఉంటుంది.కొన్ని చిట్కాలను పాటిస్తే వంట రుచి పెరుగుతుంది.

ఆ చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నార్త్ ఇండియన్ డిష్ లు రుచిగా రావాలంటే….

పనీర్ బటర్ మసాలా కర్రీ,మిక్సడ్ విజిటెబుల్ కర్రీ వంటివి ఇంటిలో చేస్తూ ఉంటాం.అవి హోటల్ మాదిరిగా రాకపోయేసరికి విసుగు వచ్చి వాటిని తయారుచేయటం మానేస్తు ఉంటాం.

కానీ నార్త్ ఇండియన్ డిష్ లు మంచి రుచికరంగా ఉండాలంటే కర్రీ మొత్తం పూర్తి అయ్యాక పొయ్యి మీద నుండి దించే ముందు కొంచెం పంచదార,కొత్తిమీర వేస్తే హోటల్ మాదిరి రుచి వస్తుంది.

పూరీలు హోటల్ లో పొంగినట్టు రావాలంటే పూరీ పిండిని కలిపి 15 నిముషాలు నానబెట్టాలి.పూరీలను వేగించేటప్పుడు నూనె బాగా వేడిగా ఉండాలి.అలాగే పొంగిన పూరీ అలానే ఉండాలంటే పూరీ పిండి కలిపేటప్పుడు కొంచెం రవ్వ వేసి కలపాలి.

దోశలు కరకరలాడుతూ ఎరుపు రంగు రావాలంటే…దోశల పిండిని మిక్సీ చేసినప్పుడు కొంచెం నానబెట్టిన మెంతులు,నానబెట్టిన పచ్చి శనగపప్పు వేయాలి.దోశలు వేసే సమయంలో దోశల పిండిలో కొంచెం బియ్యంపిండి,కొంచెం పంచదార వేస్తె దోశలు హోటల్ మాదిరిగా ఎర్రగా కరకరలాడుతూ ఉంటాయి.

పనీర్ రబ్బరులా సాగకుండా సాఫ్ట్ గా రావాలంటే… పాలను బాగా మరిగించి వెనిగర్ వేసి పాలను విరగొట్టాలి.పాలు విరిగిన తర్వాత పలుచని క్లాత్ లో ఆ పాల మిశ్రమాన్ని వేసి మూట కట్టి దాని పైన బరువుగా ఉన్న వేడి నీటి గిన్నెను పెట్టి పావుగంట తర్వాత దానిని ఫ్రిడ్జ్ లో అరగంట సేపు ఉంచి వాడుకోవాలి.

అప్పుడు పనీర్ సాఫ్ట్ గా వస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు