మెంతులను ఈ విధంగా తీసుకుంటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..!

వంటకాలలో ఉపయోగించే మెంతుల( Fenugreek Seeds )వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.అదే విధంగా మెంతులను కొన్ని విధాలుగా ఉపయోగించడం వలన మరిన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 Health Benefits Of Fenugreek Tea,fenugreek Tea,fenugreek Seeds,blood Sugar Level-TeluguStop.com

అయితే మెంతులతో టీ చేసుకుని తాగడం చాలా మంచి పద్ధతి.మెంతి టీ అనేది ఒక ప్రసిద్ధ హెర్బల్ టీ.ఈ టీ ని మెంతులతో తయారు చేసుకోవాలి.ఆహారంగా, ఒక సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా ఇందులో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి.

సాంప్రదాయ వైద్యంలో వీటిని చాలా కాలంగా ఉపయోగిస్తూ వస్తున్నారు.మెంతులు చూడడానికి పసుపు రంగులో, రుచిలో చేదుగా ఉంటాయి.అయితే వీటిని నీటిలో మరిగించినప్పుడు ఆ నీరు ప్రత్యేకమైన వాసన రుచిని అందిస్తుంది.ఆ నీళ్లలో కొద్దిగా తేనె కలిపి మెంతి టీ తయారు చేసుకోవాలి.

ఈ విధంగా మెంతి టీ( Fenugreek Tea ) తీసుకొని తాగితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.అయితే మెంతి టీ తాగితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Arthritis, Sugar Levels, Fenugreek Seeds, Fenugreek Tea, Tips, Telugu-Tel

మెంతి టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.ఈ మెంతి టీ నీ తాగితే జీర్ణ వ్యవస్థలో మంట తగ్గుతుంది.అలాగే మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.అంతేకాకుండా జీర్ణ క్రియ( Digestion ) కూడా మెరుగుపడుతుంది.మెంతి టీ లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఉన్నాయి.ఈ సమయంలో శరీరం లో మంటను, వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

అంతేకాకుండా ఆర్థరైటిస్( Arthritis ), ఇతర కీళ్ల నొప్పులను ఉన్నప్పుడు ఒక మెంతి టీ తాగితే ఉపశమనం లభిస్తుంది.

Telugu Arthritis, Sugar Levels, Fenugreek Seeds, Fenugreek Tea, Tips, Telugu-Tel

మెంతి టీ తాగడం వలన రక్తంలో చక్కెర స్థాయి( Blood Sugar Levels ) నియంత్రణలో ఉంటుంది.ఎందుకంటే ఈ టీ లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే సామర్థ్యం ఉంది.అందుకే మధుమేహం ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం కోసం సహజ ఔషధంగా మెంతి టీ నీ తీసుకోవడం మంచిది.

ఇక మహిళలు నెలసరి సమయంలో మెంతి టీ తాగితే ఋతు తిమ్మిరి నుండి ఉపశమనం పొందవచ్చు. గర్భాశయం లోని కండరాల నొప్పులు కూడా తగ్గించడానికి ఇది సహాయపడుతుంది.

మెంతి టీ తాగడం వలన పాలిచ్చే తల్లులలో రొమ్ము పాల ఉత్పత్తి( Breast Milk ) పెరుగుతుంది.ఈ టీలో పాల ఉత్పత్తిని ప్రేరేపించే సమ్మేళనాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube