తెలుగు సినిమా పరిశ్రమలో తన అద్భుత నటనతో చక్కటి పేరు సంపాదించిన నటుడు కోటా శ్రీనివాసరావు.ఆయన ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా, విలన్ గా, తండ్రిగా ఎన్నో పాత్రలు పోషించారు.ఏ క్యారెక్టర్ చేసినా.అందులో లీనమై నటించేవాడు.నటించేవాడు అనడం కంటే ఆయా పాత్రల్లో జీవించేవాడు అని చెప్పడం కరెక్ట్ అవుతుంది.అయితే తన జీవితంలో నటించిన ఓ సినిమా ఆయనకు ఘోర అవమానాన్ని తెచ్చిపెట్టింది.
ప్రాణాలు పోయేలా దెబ్బలుతినే పరిస్థితి నెలకొంది.ఇంతకీ ఆ సినిమా ఏంటి? ఆయనను కొట్టింది ఎవరు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హవా కొనసాగుతున్న రోజులవి.సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు కూడా.అదే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా ఓ సినిమా వచ్చింది.ఆ సినిమా పేరు మండలాధీశుడు.
దాంట్లో ఎన్టీఆర్ పాత్రను కోటా శ్రీనివాసరావు పోషించాడు.ఎన్టీఆర్ ను ఓ మాటల గారడీ చేసే వ్యక్తిలా.ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చే నాయకుడిలా.ఓ చీప్ క్యారెక్టర్ అనే అర్థం వచ్చేలా ఆయన పాత్రను ఇందులో దింపేశారు.ఎన్టీఆర్ క్యారెక్టర్ ను ఫన్నీగా తెరకెక్కించారు.దీంతో ఆయన అభిమానులకు కోటా టార్గెట్ అయ్యాడు.
ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు.

ఆ సినిమా విడుదలయ్యాక.కొద్ది రోజుల పాట కోటా ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు.దానికి కారణం ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహమే.
కానీ విజయవాడలోని తన అమ్మాయి ఇంటికి కోటా వెళ్లాల్సి వచ్చింది.ఆయన రైల్లో విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నాడు.ఎలా తెలిసిందో తెలియదు కానీ ఎన్టీఆర్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు.టీడీపీ జెండాలు పట్టుకుని వందల మంది స్టేషన్ కు వచ్చారు.
జై ఎన్టీఆర్ నినాదాలు చేస్తున్నారు.అందరూ కోటా శ్రీనివాసరావు కోసమే వెతుకుతున్నారు.
అప్పుడే రైలు దిగిన కోటా.ఎవరికీ కనపడకుండా జనాల్లో కలిసిపోయి బయటకు వెళ్లే ప్రయత్నం చేశాడు.

దొరికితే చంపేస్తారేమోననే భయం ఆయనలో ఆవహించింది.నెమ్మదిగా వెళ్తున్న ఆయనను ఒకడు చూసి అదిగో కోటాగాడు అంటూ గట్టి అరిచారు.ఒక్కసారిగా ఎన్టీఆర్ అభిమానులు ఆయన చుట్టుముట్టారు.కోటా వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు.విపరీతంగా కొట్టారు.రక్తం వచ్చేలా బాదారు.
చనిపోతాడేమోనని భావించి వదిలి వెళ్లాడు.వారి దెబ్బలకు తాను చనిపోతానని అనుకున్నట్లు చెప్పాడు కోటా.
ఈ ఘటన తన జీవితంలోనే మర్చిపోలేని అమానం అంటాడు కోటా.