అదే సీన్ రిపీట్.. కాకపోతే, కెప్టెన్ మారాడంతే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో హోమ్ గ్రౌండ్ మ్యాచ్‌లు కీలకంగా మారుతున్నాయి.ప్రతి జట్టు తమ సొంత మైదానంలో గెలుపును తన సత్తా నిరూపించుకునే అవకాశంగా చూస్తోంది.

 If The Same Scene Doesn't Repeat, The Captain Will Change, Ipl 2025, Lucknow Sup-TeluguStop.com

అయితే, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ (LSG) తమ హోమ్ గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి చెందడం అభిమానులకు నిరాశ కలిగించింది.ఈ పరాజయం అనంతరం జరిగిన సంఘటన మాత్రం మరింత చర్చనీయాంశంగా మారింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో అద్భుత విజయం సాధించినప్పటికీ, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తేలిపోయింది.అన్ని విభాగాల్లోనూ పంజాబ్ ఆధిపత్యం ప్రదర్శించింది.లక్నో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో ఆశించిన ప్రదర్శన చేయకపోవడం ఓటమికి కారణమైంది.ఈ ఓటమి తర్వాత లక్నో కెప్టెన్ రిషభ్ పంత్, జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య జరిగిన సంభాషణ సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి.

మ్యాచ్ అనంతరం డ్రెస్‌ రూమ్‌లో సంజీవ్ గోయెంకా, కెప్టెన్ రిషభ్ పంత్‌తో తీవ్రంగా చర్చిస్తున్న వీడియోలు బయటకు రావడంతో క్రికెట్ ప్రేమికులు, విశ్లేషకులు దీన్ని విమర్శిస్తున్నారు.ఓటమి తర్వాత కెప్టెన్‌ను ప్రశ్నించాల్సిన అవసరం లేదని, దీనికి కోచ్‌లు ఉన్నారని అభిప్రాయపడుతున్నారు.గతంలో కేఎల్ రాహుల్‌ విషయంలోనూ గోయెంకా ఇలాగే ప్రవర్తించారని అభిమానులు గుర్తు చేస్తున్నారు.కెప్టెన్‌కు స్వేచ్ఛ ఇస్తేనే మంచి ఫలితాలు వస్తాయని పలువురు వాదిస్తున్నారు.

అయితే తాజాగా జరిఇగిన మ్యాచ్ తర్వాత గోయెంకా మాట్లాడుతూ.పంజాబ్‌కు మేం నిర్దేశించిన లక్ష్యం సరిపోలేదు.కనీసం 25 పరుగులు అదనంగా చేయాల్సింది.ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు, కానీ పిచ్‌ను సరిగ్గా అంచనా వేయడం అవసరం.త్వరగా వికెట్లు కోల్పోతే, భారీ స్కోరు చేయడం కష్టమే.కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి, ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగుతాం అని వ్యాఖ్యానించాడు.

కెప్టెన్, ఆటగాళ్లపై ఒత్తిడి పెంచడం సమంజసం కాదని, ఇతర ఫ్రాంచైజీల యాజమాన్యాలు ఇలా ప్రవర్తించకపోవడం గమనార్హమని విశ్లేషకులు అంటున్నారు.లక్నో జట్టు భవిష్యత్తులో గెలుపు బాట పట్టాలంటే మేనేజ్మెంట్ ఆటగాళ్లపై పూర్తి నమ్మకం ఉంచి, వారికి సహకరించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube