కొన్నిసార్లు మనల్ని కించపరిచేలా.చులకన చేసేలా మాట్లాడే మాటలు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తాయి.
ఎలాగైనా వారి మాటలు తప్పని నిరూపించి మన సత్తా చాటాలి అనుకుంటాం! సరిగ్గా ఇలాంటి మాటలు విని మెగా హీరో అల్లూ అర్జున్ ఓసారి తీవ్ర ఆవేశానికి లోనయ్యాడు.ఎలాగైనా తమపై వచ్చిన చులకన మాటలను చేతలతో తిప్పికొట్టాలని భావించాడు.
ఇంతకీ తనను హర్ట్ చేసిన మాటలు ఏంటి? ఆయన వాటిని ఎలా తిప్పికొట్టాడు? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం!
2005లో బాలీవుడ్ లో సిక్స్ పాక్స్ జోరు కొనసాగుతోంది.హిందీ హీరోలందరూ తమ తమ సినిమాల్లో సిక్స్ పాక్స్ చూపిస్తూ తెగ అదరగొడుతున్నారు.
ఇదే సమయంలో సిక్స్ ప్యాక్ చూపించడం సౌత్ హీరోలకు సాధ్యం కాదని ఓ బాలీవుడ్ బ్యూటీ కామెంట్ చేసింది.ఈ మాటలు వినగానూ అల్లూ అర్జున్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది.
ఎలాగైనా వచ్చే సినిమాలో సిక్స్ ప్యాక్ చేసి చూపించాలని ఫిక్స్ అయ్యాడు.
అదే సమయంలో పూరీ తనతో సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.
అయితే హీరో సిక్స్ ప్యాక్‌లో కనిపించేలా చూడాలని పూరీని కోరుతాడు.అందుకు పూరీ సరేనంటాడు.
ఆ రోజు నుంచి రోజుకు 4 గంటల పాటు సుమారు నెల పాటు జిమ్‌లో వర్కవుట్స్ చేశాడు.అనుకున్నట్లుగానే సిక్స్ ప్యాక్ సాధించాడు.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం ముంబై నుంచి హన్సికను రప్పించాడు పూరీ.చక్రీ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.
అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ చిత్రంలో అల్లూ అర్జున్ సిక్స్ ప్యాక్ చూపిస్తున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి.అప్పటికే పోకిరితో బంఫర్ హిట్ కొట్టిన పూరీ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది.72 రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగింది.2007 జనవరి 12న సంక్రాంతి బరిలో నిలిచింది దేశముదరు.మొత్తం 500 థియేటర్స్ లో విడుదల అయ్యింది.10 కోట్ల రూపాయలతో తీసిన ఈ సినిమా మొదటి వారంలోనే 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.243 సెంటర్లలో 50 రోజులు ఆడింది.129 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.మొత్తంగా ఈ మూవీ 23 కోట్లు వసూలు చేసింది.
బాలీవుడ్ బ్యూటీ మాటలతో సిక్స్ ప్యాక్ చూపించిన అల్లు అర్జున్.సౌతిండియా హీరోలు సైతం బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపించాడు.