హై బీపీ( High BP ) అనేది చాలా మందిని చాలా కామన్ గా వేధించే సమస్య.తీవ్రమైన తలనొప్పి, చిరాకు, ఛాతిలో నొప్పి, వాంతులు, అయోమయం, కంటి చూపు మందగించడం, గుండె వేగంగా కట్టుకోవడం వంటివి అధిక రక్తపోటు లక్షణాలు.
అయితే అధిక రక్తపోటును అదుపులోకి తేవడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా ఉత్తమంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ కూడా ఆ కోవకే చెందుతుంది.
మరి ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ దానిమ్మ గింజలు( Pomegranate ) వేసుకోవాలి.
అలాగే ఒక కప్పు పీల్ తొలగించి సన్నగా తరిగిన బీట్ రూట్ ముక్కలు,( Beetroot ) హాఫ్ టీ స్పూన్ అల్లం ముక్కలు మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.ఇప్పుడు స్టైనర్ సహాయంతో బ్లెండ్ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్ ను ఫిల్టర్ చేసుకొని నేరుగా తాగేయడమే.
ఈ బీట్ రూట్ దానిమ్మ జ్యూస్ ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు చేకూరుస్తుంది.

ముఖ్యంగా హై బీపీతో తరచూ బాధపడేవారు ఈ జ్యూస్ ను వారానికి కనీసం రెండుసార్లు అయినా తీసుకోండి.బీట్‌రూట్ మరియు దానిమ్మ జ్యూస్ ఆరోగ్యకరమైన రక్తపోటు స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.దానిమ్మ రక్తపోటును తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అలాగే బీట్‌రూట్‌లో నైట్రేట్లు సమృద్ధిగా ఉంటాయి, వీటిని శరీరం నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తుంది, ఈ సమ్మేళనం రక్త నాళాలను సడలించడానికి మరియు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుంది.

బీట్‌రూట్ దానిమ్మ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల అందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షిస్తాయి.క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి.బీట్‌రూట్ లో ఫోలేట్ ఉంటుంది, ఇది ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తికి ప్రయోజనకరంగా ఉంటుంది.
దానిమ్మలో జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి.బీట్‌రూట్ దానిమ్మ జ్యూస్ ఇనుము శోషణను మెరుగుపరచడంలో, రక్తహీనతను నివారించడంలో కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తుంది.