టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత( Samantha ) ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.తాజాగా సక్సెస్( Success ) గురించి సమంత మాట్లాడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
నా దృష్టిలో సక్సెస్ అంటే స్వేచ్ఛ, స్వతంత్రం అని ఆమె అన్నారు.నేను సక్సెస్ అయ్యానని ఇతరులు చెప్పే వరకు నేను వేచి ఉండనని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.
సక్సెస్ అంటే మనకు నచ్చిన విధంగా జీవించడం అలాగే మన అభిరుచికి అనుగుణంగా పనులు చేయడం అని సమంత చెప్పుకొచ్చారు.అంతే తప్ప మహిళలను ఒక చోట బంధించి ఇది చేయాలి? ఇది చేయకూడదు? అని చెప్పడం కాదని ఆమె పేర్కొన్నారు.రియల్ లైఫ్ లో అన్ని రకాల పాత్రలను పోషిస్తూ సమర్థవంతంగా రాణించగలగడమే సక్సెస్ అని సమంత పేర్కొన్నారు.

కొత్త టాలెంట్, అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించడానికి తాను నిర్మాణ రంగంలో అడుగుపెట్టానని సమంత వెల్లడించారు.తాను కన్న కలల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని సమంత పేర్కొన్నారు.చదువుకునే రోజుల్లో సిడ్నీ యూనివర్సిటీలో( Sydney University ) చదువుకోవాలని తాను అనుకున్నానని ఆమె వెల్లడించారు.
అయితే తన కల మాత్రం నెరవేరలేదని సమంత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

అనుకోకుండా తాను సినిమాల్లోకి అడుగుపెట్టానని సమంత వెల్లడించారు.నటిగా ఇంతమంది అభిమానం పొందడం ఎంతో సంతోషంగా ఉందని సమంత పేర్కొన్నారు.ప్రతి ఒక్కరూ తమ కలల సాకారం దిశగా అడుగులు వేయాలని సామ్ సూచించారు.
సమంత తాజాగా సిటాడెల్ హనీబన్నీ( Citadel Honey Bunny ) సిరీస్ తో అలరించారు.ప్రస్తుతం సమంత ఒక యాక్షన్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నారు.స్టార్ హీరోయిన్ సమంత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.