తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు దాసరి నారాయణ రావు రాఘవేందర్ రావు లాంటి గొప్ప దర్శకులు ఉండే వాళ్లు.ఏ పెద్ద హీరోతో సినిమా చేయాలన్న మొదటగా వీళ్ళ పేరే వినిపించేది అలాంటి గొప్ప దర్శకులు వీళ్లు.
అందరూ అగ్ర హీరోలతో సినిమాలు చేసి మంచి హిట్స్ అందుకున్నారు అలాంటి దర్శకుల తర్వాత ఇండస్ట్రీలో ఇప్పుడున్న దర్శకులలో రాఘవేంద్ర రావు గారి శిష్యుడైన రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్నాడు.ఆయన తీసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోగా మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన సింహాద్రి సినిమా రాజమౌళి నీ మాస్ డైరెక్టర్ ని చేస్తే ఎన్టీఆర్ ని మాస్ హీరోని చేసింది.అలాగే రాజమౌళి గారు తీసిన చత్రపతితో సినిమా ప్రభాస్ స్టార్ హీరో అయిపోయాడు అలాగే రాజమౌళి కెరియర్లో ఎప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేయలేదు.
ఆయనే స్టార్ హీరో లను తయారు చేశారు.
అప్పట్లో దాసరి నారాయణరావు గారు ఎప్పుడు అంటూ ఉండేవారు ఒక ఒక దర్శకుడు ఒక స్టార్ హీరో ని తయారు చేయగలరు, కానీ ఒక స్టార్ హీరో స్టార్ దర్శకుడిని తయారు చేయలేడు అని చెప్పిన మాటలు మనం అర్థం చేసుకుంటే దానికి రాజమౌళి ని బెస్ట్ ఉదాహరణగా చెప్పవచ్చు.
చిరుత సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ నీ హీరోగా పెట్టి ఒక సినిమా తియ్యమని చిరంజీవి, అల్లు అరవింద్ కలిసి రాజమౌళిని అడగడంతో కాదనలేక రాజమౌళి రామ్ చరణ్ తో మగధీర సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.ఇప్పుడు ప్రభాస్ తో బాహుబలి సినిమా తీసి ఇంటర్నేషనల్ గా రాజమౌళి అందరికీ తన స్టామినా ఏంటో చూపించాడు.
ఒక విధంగా చెప్పాలంటే తెలుగు దర్శకుడు అయిన రాజమౌళి ఇంటర్నేషనల్ స్థాయికి చేరడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం.
అయితే బాహుబలి సినిమా షూట్ నడిచేటప్పుడు జరిగిన కొన్ని గమ్మత్తు విషయాలు గురించి చెప్పాలంటే రాజమౌళి సినిమా సినుకు సంబంధించి షూట్ లో బిజీగా ఉండేవాడు అప్పుడు ప్రభాస్ వరుసగా సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ షూట్ లేని సమయంలో కూర్చొని అందరితో సిగరెట్ తాగుతూ మాట్లాడేవాడు రాజమౌళి దాన్ని గమనించి ప్రభాస్ చేత సిగరెట్లు మానేసెలా చేద్దామని తెగ ప్రయత్నం చేసినప్పటికీ వర్కౌట్ కాలేదని అప్పట్లో వార్తలు చాలా వచ్చాయి.
రాజమౌళి ఏ సినిమా షూటింగ్ లో ఉన్నా కూడా షూటింగ్ సెట్ లోకి వచ్చిన ఆర్టిస్టులకు హాయ్ చెప్పి తన పని తాను చూసుకుంటారు అంట ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఇవాళ తీయాల్సిన సీన్ కి సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అనేది తనకు తానే సమాధానం చెప్పుకుంటూ ఉంటాడు అంట తాను తీయబోయే సీన్ గాని షార్ట్ గాని తీసేదాకా వాళ్ల కో డైరెక్టర్ కి కూడా తెలియదంట.అతనొక్కడే అన్ని క్రాఫ్ట్ లో ఇన్వాల్వ్ అవుతూ తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్తారు అంట దర్శకత్వ శాఖలో రాజమౌళి దగ్గర పనిచేస్తున్న వాళ్లకి ఎక్కువగా పని చెప్పాడంట తను చేసుకుంటూ వెళ్తాడు.
షూట్ లో అతన్ని చూస్తే ఒక మహ రుషి నీ చూసినట్టుగా ఉంటుందని చాలా మంది ఆర్టిస్టులు చెప్పారు.రాజమౌళి మంచి నటుడని ఏ సీన్ అయిన మనం చేసేటప్పుడు ముందు రాజమౌళి చేసి చూపిస్తాడని ఆయనలో ఒక రెండు పర్సెంట్ మనం చేసిన మనకి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుందని చాలా మంది నటులు చాలా సార్లు చెప్పారు.రాజమౌళి సినిమా సినిమా కి తన టీమ్ ని మార్చడు కొన్ని సంవత్సరాల పాటు ఒకే టీమ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు.మొదటి సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి గారు మాత్రమే ఉన్నారు ఎందుకు మీరు కీరవాణి గారి ని తీసుకుంటారు అని రాజమౌళిని అడిగితే నాకు మ్యూజిక్ మీద పెద్దగా అవగాహనలేదు.
పెద్దన్న అయితే నా సినిమాకి ఏ మ్యూజిక్ కావాలో ఆయనకి తెలుసు ఆయన దగ్గరుండి చూసుకుంటారు కాబట్టి నేను కీరవాణి గారిని నా సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకుంటాను.అలాగే తను తీసిన చాలా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ ని తీసుకుంటారు.ఎందుకలా తీసుకుంటారు అని అడిగితే మనకు ఎవరైతే సెట్ అవుతారో వాళ్లనే నేను ఎక్కువ కాలం పాటు నా సినిమాల్లో తీసుకుంటాను.అంతే తప్ప మనకు సెట్ అయిన వాళ్ళని వదిలేసి వేరే కొత్త వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి మనకు మైండ్ సెట్ కలవడానికి చాలా టైం పడుతుంది ఆ ప్రాసెస్ లో మనం తీసిన సినిమా అవుట్ పుట్ అనేది సరిగ్గా రాకపోవచ్చు అని నాకు అనిపించింది అందుకే ఇంతకుముందు సినిమాల్లో చేసిన టెక్నీషియన్స్ ని నేను తర్వాత సినిమాలు తీసుకున్నాను అని రాజమౌళి గారు చాలా సందర్భాల్లో చెప్పారు.