చైనాలోని షెన్‌జెన్ నగరంలో(Shenzhen city, China) ఒక మసాజ్ పార్లర్ దిమ్మతిరిగే ఆఫర్‌తో దుమ్ము రేపుతోంది.80 నిమిషాల డీటాక్స్ మసాజ్‌ని(Detox massage) కేవలం 9 యువాన్లకే (మన కరెన్సీలో జస్ట్ రూ.109) అందిస్తోంది.నార్మల్‌గా అయితే ఈ మసాజ్ ఖరీదు 200 యువాన్లు(200 yuan) (సుమారు రూ.2,400).కానీ, ఈ డీల్ అందరికీ లేదు, కొన్ని కండీషన్లు పెట్టింది ఈ పార్లర్.
అవేంటో తెలుసా?
ఈ ఆఫర్ అందుకోవాలంటే మహిళలు కనీసం ఒక్క కండీషన్ అయినా మ్యాచ్ చేయాలంట.మొత్తం 27 కండీషన్లు పెట్టారు.
అవేంటంటే.ఆడి, మెర్సిడెస్ బెంజ్, పోర్షే లాంటి లగ్జరీ కార్లు (Luxury cars)ఉండాలి, లేటెస్ట్ ఐఫోన్ 16 ప్రో(iPhone 16 Pro) మ్యాక్స్ వాడాలి, ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఉండాలి, టెన్సెంట్ లేదా హువావే లాంటి పెద్ద టెక్ కంపెనీల్లో పనిచేయాలి, డాక్టర్ లేదా బ్యాంకర్ అవ్వాలి, లేదంటే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా 5 లక్షల మంది ఫాలోవర్లు ఉండాలి.
ఇంకా యూరప్ లేదా యూఎస్ వెళ్లిచ్చిన వాళ్లకి కూడా ఛాన్స్ ఉందట.

“అసాధారణంగా రాణిస్తున్న మహిళల కోసమే ఈ ఆఫర్” అని పార్లర్ యాజమాన్యం (Parlor ownership)చెబుతోంది.కస్టమర్లు తాము కండీషన్లు మ్యాచ్ చేస్తున్నట్లు ప్రూఫ్ చూపించాలంట.క్వాలిఫై అవ్వకపోతే “2025లో మరింత కష్టపడండి” అని చెబుతున్నారట.
మహిళల్ని సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి ఇన్‌స్పైర్ చేయడమే తమ ఉద్దేశం అని స్టాఫ్ చెబుతున్నారు.

ఈ ఆఫర్ చూసి నెటిజన్లు మండిపడుతున్నారు.ఇది చైనా వినియోగదారుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని కొందరు అంటున్నారు.అందరికీ సమానంగా చూడాలని చట్టం చెబుతోంది కదా అని ప్రశ్నిస్తున్నారు.
మరికొందరు ఇది కేవలం మార్కెటింగ్ ట్రిక్ అని కొట్టిపారేస్తున్నారు.అసలు అంత డబ్బున్నోళ్లు మసాజ్‌లో డిస్కౌంట్ కోసం ఎందుకు చూస్తారని లాజిక్ తీస్తున్నారు.
ఇంకొందరైతే.ధనవంతులైన కస్టమర్లను అట్రాక్ట్ చేసి వాళ్లకి ఖరీదైన సర్వీసులు అమ్మడానికే ఈ ప్లాన్ అని అనుమానిస్తున్నారు.
ఇలాంటి ఆఫర్లు చైనాలో కొత్తేం కాదు అంటున్నారు జనాలు.పోయినేడాది జియాంగ్సులో ఒక స్విమ్మింగ్ క్లబ్ కూడా ఇలాగే చేసింది.చదువుకున్న, 45 ఏళ్లలోపు మహిళలకు మాత్రమే మెంబర్‌షిప్ ఇచ్చారంట.వాళ్లకి “హై ఐక్యూ, మంచి పర్సనాలిటీ” ఉంటాయని వాళ్ల వెర్షన్.
మొత్తానికి ఈ మసాజ్ పార్లర్ ఆఫర్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఏం జరుగుతుందో చూడాలి.