నాని( Nani ) నటిస్తున్న లేటెస్ట్ మూవీ పారడైజ్( Paradise ).చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెలా( Srikanth Odela ) దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
సికింద్రాబాద్లోని పారడైజ్ హోటల్ ప్రాంతంలో జమానాకాలం నాడు ఉండే జనాల నేపథ్యంలో సాగే కథగా తెలుస్తోంది.ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.ఈ సినిమా గ్లిమ్స్ ని కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.26.03.26 విడుదల అంటూ విడుదల తేదీని కూడా ప్రకటించేశారు.అంటే మార్చిలో శ్రీరామనవమి విడుదల కానుంది.ఏడాది ముందుగా డేట్ ఎందుకు వేసారా అని అంతా అనుకున్నారు.

ఇప్పుడు అంతా అలా వేయడం కామన్ అయింది కదా అని కూడా అనుకున్నారు.కానీ అందుకు వేరే కారణం ఉన్నట్టు తెలుస్తోంది.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్( NTR, Prashant Neel ) భారీ పాన్ ఇండియా డ్రాగన్ సంగతి తెలిసిందే.అది త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.ఈ సినిమాను 26 మార్చి 2026 విడుదల చేయాలని యూనిట్, హీరో, డైరక్టర్ ఒక ప్లానింగ్ లో వున్నారని తెలుస్తోంది.మరి ఇది తెలిసి పారడైజ్ డేట్ ముందుగా కొట్టారో, లేక తెలియక కొట్టారో మరి.పాన్ ఇండియా సినిమాలు డేట్ ముందుగా చెప్పకుండా నార్త్ ఇండియాలో కష్టం.అలాగే తమిళ నాట పెద్ద సినిమాలు రాకుండా చూసుకోవాలి.

ఇవన్నీ కాక ఓటీటీ( OTT ) వాళ్లతో మాట్లాడుకోవాలి.అందువల్ల డ్రాగన్ డేట్ విషయంలో ముందుగానే ఓ ఐడియాకు వచ్చి వున్నారట.ఇప్పుడు పారడైజ్ డేట్ కొట్టారు.మరి డ్రాగన్ డేట్ అధికారికంగా ప్రకటించలేదు కనుక ఏం చేస్తుందో చూడాలి మరి.మరి వచ్చే ఏడాది మార్చిలో అనగా 2026 లో ఎన్టీఆర్ నానీలలో ఎవరు సక్సెస్ అవుతారు.ఇద్దరూ ఒకేసారి బాక్సాఫీస్ బరిలో నిలుస్తారా లేదంటే విడుదల చేయని వాయిదా వేసుకుంటారా అన్నది చూడాలి మరి.ఇవి రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.