రాత్రి సమయంలో ఈ పదార్థాలను తింటే అధిక బరువు పెరిగే ప్రమాదం ఉందా..

ప్రస్తుత సమాజంలో చాలామందికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.వీరిలో చాలామందికి అధిక బరువు కూడా ఒక సమస్యగా మారింది.

 Avoid These Foods At Night For Weight Loss,weight Gain,foods,worst Foods,weight-TeluguStop.com

శరీరబరువును అదుపులో ఉంచుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.లేదంటే బరువు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యసమస్యలు కూడా పెరిగే అవకాశం ఉంది.

అంతేకాదు శరీర బరువుతో ముడిపడి అనేక రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

అయితే ఎత్తుకు తగ్గ బరువును మెయింటేన్ చేయమని వైద్యులు చెబుతారు .అనారోగ్యకరమైన ఆహారాలు, జంక్ ఫుడ్, తీపి పదార్థాలు అధికంగా తినడం వల్ల త్వరగా బరువు పెరిగి అనారోగ్య పాలవుతారు.అయితే రాత్రిపూట కొన్ని ఆహారాలను తరచూ తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారు.

కొంతమంది ప్రజలు టీ, కాఫీలు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువగా తాగుతూ ఉంటారు.తాగిన వారు ఏముంది కొంచెం టీ కాఫీ గా మనం తాగింది అనుకుంటూ ఉంటారు.కానీ వీటిలో ఉండే కెలరీలు కెఫిన్ రాత్రిపూట వీటిని తాగడం వల్ల జరిగే సరిగ్గా నిద్ర పట్టగా బరువు పెరిగే అవకాశం ఉంది.రాత్రి పూట కడుపు నిండా చికెన్ బిర్యానీలు, మటన్ ఫ్రైలు తినేసి పడుకుంటే మాత్రం కచ్చితంగా అధిక బరువు పెరిగి పొట్ట ముందుకి వస్తుంది.

మీకు అంతగా మాంసాహారం తినాలనిపిస్తే రాత్రి ఏడుగంటలకే తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

క్యాబేజీ, కాలీ ఫ్లవర్ లలో ఫైబర్ అధికంగా ఉంటుంది.కాబట్టి ఈ ఆహార పదార్థాలు తిన్న వెంటనే జీర్ణం కాకుండా చాలా ఎక్కువ సేపు అలాగే ఉంటాయి.కాబట్టి రాత్రిపూట తీసుకోకుండా ఉండడం మంచిది.

మద్యం, బీర్లు రాత్రయితే చాలు సిట్టింగ్ పేరుతో ఆల్కహాల్ తాగే వారి సంఖ్య ప్రస్తుత సమాజంలో బాగా పెరిగిపోయింది.రాత్రిపూట మద్యం సేవించే వారికి అధిక బరువు సమస్య వచ్చే అవకాశం ఉంది.

దీనివల్ల ఎంత వీలైతే అంత మద్యానికి దూరంగా ఉండడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube