రేపు హైదరాబాద్ కు కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్..!

కాంగ్రెస్ తెలంగాణ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ రేపు హైదరాబాద్ కు రానున్నారు.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ప్రవేశించడంతో పాటు మునుగోడు ఉపఎన్నిక కూడా ఉన్న నేపథ్యంలో ఆయన దాదాపు నెల రోజులపాటు తెలంగాణలోనే మకాం వేయనున్నారు.

 Congress In Charge Of Telangana To Hyderabad Tomorrow..!-TeluguStop.com

ఈ క్రమంలో ఉపఎన్నికలో పార్టీ పనితీరును పరిశీలించేందుకు మునుగోడులో ఠాగూర్ పర్యటించనున్నారు.మాణిక్కం ఠాగూర్ రంగంలోకి దిగడంతో పార్టీ క్యాడర్ మరింత చురుగ్గా ముందుకు సాగుతోందని చెప్పొచ్చు.

ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పార్టీ ఇంఛార్జ్ లు మకాం వేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఉపఎన్నికలో గెలుపే ధ్యేయంగా నేతలు చేయాల్సిన కార్యాచరణపై, రాహుల్ పాదయాత్ర రూట్ మ్యాప్ పై కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube