ఈ ఆహార పదార్థాల రుచి కి అలవాటు పడితే క్యాన్సర్ రావడం ఖాయం..?

ప్రపంచవ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ తో మరణిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.అందుకే క్యాన్సర్ పేరు చెప్పగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు.

 If You Get Used To The Taste Of These Foods, You Will Surely Get Cancer, Foods,-TeluguStop.com

ఇక క్యాన్సర్ వస్తే మరణించడం ఒక్కటే దిక్కని కూడా చాలామందిలో అపోహ ఉంటుంది.ఇక క్యాన్సర్ నీ ఆలస్యంగా గుర్తిస్తే పరిస్థితి చేయి దాటినట్లే.

అసలు క్యాన్సర్ బారిన పడడానికి కారణం ఏంటి? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల క్యాన్సర్( cancer ) బారిన పడతారు అనే విషయాలు పూర్తిగా తెలుసుకుందాం.క్యాన్సర్ నుంచి మనల్ని మనం రక్షించుకోవాలంటే ముందుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

డైట్ లో జంక్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్( Junk Food ), రోడ్ సైడ్ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి.కొందరు వ్యక్తులు మద్యానికి బానిసలు అవుతారు.

Telugu Alcohol, Cancer, Foods, Tips, Junk, Turmeric-Telugu Health Tips

అయితే ఆల్కహాల్( Alcohol ) ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే నోరు, అన్నవాహిక, కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.మాంసాహారం అందులోనూ రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినే వ్యక్తులకు కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.ప్రాసెస్ అంటే ఏమిటంటే ప్యాకింగ్ చేసిన మాంసం ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు వీటికి కొన్ని రకాల పదార్థాలను కలుపుతారు.

మీరు ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే దాన్ని తగ్గించుకోవాలి.దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది.ముఖ్యంగా యువత ఇలాంటి వాటిని ఎక్కువగా తింటున్నారు.

Telugu Alcohol, Cancer, Foods, Tips, Junk, Turmeric-Telugu Health Tips

మనం ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఇంటి ఆహారమే తింటున్న సరే ఆయిల్ సరైన పద్ధతిలో వినియోగించకపోతే క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ముఖ్యంగా చెప్పాలంటే వాల్నట్స్, అవిసె గింజలలోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు క్యాన్సర్లను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.అవిసె గింజలతో పాటు ఇతర తృణధాన్యాలోని పీచుతో క్యాన్సర్ ను నిరోధించవచ్చు.

ఇంకా చెప్పాలంటే కప్పు నీళ్లలో టీ స్పూన్ పసుపు( Turmeric )తో పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి రోజు తాగితే ఫలితం ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే బయటి ఆహార పదార్థాలకు మన నాలుక అలవాటు పడితే మాత్రం చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube