టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరో అతనే.. ప్రభాస్ తర్వాత ఆ స్థాయి ఎవరిదంటే?

ఆర్మాక్స్ సర్వే సంస్థ ఫలితాలు ప్రేక్షకుల్లో ఎల్లప్పుడూ ఒకింత ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి.ఈ సంస్థ జూన్ నెల టాలీవుడ్ మోస్ట్ పాపులర్ స్టార్( Tollywood Most Popular Star ) వివరాలను వెల్లడించగా ఆ వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

 Tollywood Industry Most Popular Star Hero Details, Tollywood Most Popular Star,-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ హీరోగా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) నిలవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ప్రభాస్ వరుసగా ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు.

కల్కి సినిమా హిట్ కావడం కూడా ప్రభాస్ కు ఒక విధంగా కలిసొచ్చిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ జాబితాలో ప్రభాస్ తర్వాత స్థానంలో తారక్( Tarak ) నిలిచారు.

తారక్ త్వరలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తుండటం గమనార్హం.

ఐకాన్ స్టార్ బన్నీ( Bunny ) ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు.

Telugu Allu Arjun, Chiranjeevi, Mahesh Babu, Nani, Ormax, Pawan Kalyan, Prabhas,

స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.స్టార్ హీరో చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాది చివర్లో రిలీజయ్యే అవకాశం ఉంది.జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచారు.

న్యాచురల్ స్టార్ నానికి ఈ జాబితాలో ఏడో స్థానం దక్కడం కొసమెరుపు.మాస్ మహారాజ్ రవితేజ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Telugu Allu Arjun, Chiranjeevi, Mahesh Babu, Nani, Ormax, Pawan Kalyan, Prabhas,

స్టార్ హీరో చిరంజీవి ఈ లిస్ట్ లో తొమ్మిదో స్థానంలో నిలిచారు.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.మరో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు.విజయ్ నటించి విడుదలైన ఫ్యామిలీస్టార్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube