వైరల్ వీడియో: 92 ఏళ్ల బామ్మ ఈ వయసులో ఆ సాహసలేంటి భయ్యా..

ప్రస్తుత కాలంలో చాలామంది ఇబ్బంది పడుతున్న అనారోగ్య సమస్యల్లో ఫిట్నెస్( Fitness ) ఒకటి.ప్రస్తుతం దొరికే ఆహారం అలాగే జీవించే జీవనశైలి కారణంగా మనం సరిగా, ఫీట్ గా ఉండలేకపోతున్నాం.

 Woman Aged 92 Climbs 2-meter Gate In 24 Seconds To Escape China Nursing Home Vir-TeluguStop.com

దాంతో మనం కేవలం కొద్ది దూరం నడిచిన గాని.లేకపోతే మూడు లేదా నాలుగు ఫ్లోర్లు మెట్లు ఎక్కితే చాలు అలసిపోతున్నాము.

ఇలాంటి రోజుల్లో ఓ 92 ఏళ్ల భామ ఏకంగా 8 అడుగుల భారీ గేటును సునాయసంగా ఎక్కి ఒకవైపు నుంచి మరోవైపుకి వెళ్లిపోయింది.ఈ సంఘటన చైనా దేశంలో( China ) చోటుచేసుకుంది.

బామ్మ గేటును( Gate ) ఒక వైపు నుంచి మరోవైపుకి దూకే సమయంలో సీసీ కెమెరాలు రికార్డ్ అయిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Telugu China, Lady, Climbs Gate, Fitness-Latest News - Telugu

తూర్పు చైనాలోని షాన్ డాంగ్ ప్రావిన్స్ లో ఓ నర్సింగ్ హోమ్ లో ఉంటున్న ఆ వృద్ధురాలు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేసిన సమయంలో ఈ సంఘటన జరిగింది.దాదాపు 8 అడుగుల పొడవైన గేటును ఆ బామ్మ చాలా సులువుగా ఎక్కేసి ఒకవైపు నుంచి మరోవైపుకు దూకి అక్కడి నుంచి పారిపోయింది.అయితే ఈ వీడియోని చూసిన నర్సింగ్ హోమ్( Nursing Home ) సిబ్బంది వెంటనే చుట్టుపక్కల ప్రాంతంలో బామ్మని( Old Woman ) వెతికి పట్టుకొని తిరిగి మళ్ళీ నర్సింగ్ హోమ్ కు తీసుకువచ్చారు.

Telugu China, Lady, Climbs Gate, Fitness-Latest News - Telugu

ఆ బామ్మ చేసిన సాహసాన్ని ఆ నర్సింగ్ హోమ్ నిర్వాహకులు సిసిటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియోని చూసిన సోషల్ మీడియా నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.అంతేకాదు రకరకాలుగా ఆ బామ్మ పై కామెంట్ చేస్తున్నారు.బామ్మ నువ్వు అసలు మామూలు బామ్మవి కాదు.నువ్వు ” సూపర్ బామ్మ ” అంటూ కొందరు అంటుండగా మరికొందరేమో వయసు కేవలం సంఖ్య మాత్రమే అని కామెంట్ చేస్తున్నారు.కొందరైతే వయసు రీత్యా నువ్వు వృద్ధురాలు కానీ.

మనసు రిత్య అయితే మాత్రం కాదంటూ కాస్త ఫన్నీగా కామెంట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube