తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు చిరు.అంతే కాకుండా ఈ తరం హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు.
ఇది ఇలా ఉంటే చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంభర.( visvambara ) ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా చిరంజీవికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేమిటంటే.
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.చిరంజీవి కెరీర్ లో హిట్లతో పాటు ప్లాప్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.
అయితే అందులో కొన్ని మాత్రం తన తప్పిదం లేకుండా ఇతర కారణాల వల్ల ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయి.కథ, దర్శకులు, మ్యూజిక్ ఇలాంటి ఎలిమెంట్స్ హిట్ ప్లాప్ లో భాగం అవుతుంటాయి.
కానీ ఒక హీరోయిన్ వల్ల చిరంజీవి సినిమా ప్లాప్ అయ్యిందని మీకు తెలుసా? మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చిరంజీవి వరుసగా హిట్ సినిమాలు చేస్తున్న టైమ్ లో చేసిన ఒక సినిమా రివర్స్ అయ్యింది.
ఆయన చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది.ఒక హీరోయిన్ వల్ల ఆ సినిమా ప్లాప్ అయ్యిందంటే నమ్మడానికి వచిత్రంగా ఉంటుంది.

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.శంకర్ దాదా జిందాబాద్( Shankar Dada Zindabad ).అవును ఈ సినిమా ప్లాప్ కు కారణం హీరోయిన్ అని ముద్రపడిపోయింది.సంజయ్‌దత్ హిందీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు.
జయంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ సాధించింది.అయితే ఈ సినిమాలో చిరంజీవి పెర్ఫామెన్స చించేశారు.హీరోయిజం, కామెడీ, సెంటిమెంట్, లవ్, యాక్షన్ ఇలా ఏ విషయంలో కూడా తగ్గలేదు.చిరంజీవికి తోడు అదమైన ముద్దు గుమ్మ సోనాలి బింద్రే కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యారు.
అయితే శంకర్ దాదా కు సీక్వెల్ గా శంకర్‌దాదా జిందాబాద్ ను కూడా చేశారు చిరు.బాలీవుడ్ లో సంజయ్ దత్ చేసిన లగేరహే మున్నాభయ్( Lagerahe Munnabhai ) ను శంకర్ దాదా జిందాబాద్ గా తీశారు.
అయితే ఈ సినిమాకు ప్రభుదేవా డైరెక్టర్.ఈ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది.ఫస్ట్ పార్ట్‌కు పెద్ద ప్లస్ పాయింట్ హీరోయిన్‌గా సోనాలి బింద్రే నిలిచింది.కానీ, సీక్వెల్ లో మాత్రం కరిష్మా కొటక్( Karisma Kotak ) సినిమాకు మైనస్ అయ్యింది అంటారు.అంతే కాదు చిరంజీవి పక్కన ఆమె ఏమాత్రం సూట్ అవ్వలేదని ఫ్యాన్స్ ఫుల్ గా డిస్సపాయింట్ అయ్యారు.
ఆమె ఏజ్ బార్ లా కనిపించిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.అందుకే ఈ సినిమా జనాలకు అస్సలు నచ్చలేదని అభిప్రాయంవెల్లడి అయ్యింది.అంతే కాకుండా ప్రభుదేవా చెత్త డైరెక్షన్ తో పాటు హీరోయిన్ కరిష్మా కొటక్ కూడా శంకర్‌దాదా సీక్వెల్ ఫ్లాప్ కి కారణం అన్న టాక్ అప్పట్లో వినిపించింది.







